HanuMan Box Office Collection Day 5: బాక్సాఫీస్ బరిలో 'హనుమాన్'కు పోటీ లేదు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా వసూళ్ళ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రేక్షకుల ఆదరణతో విజయ విహారం దిగ్విజయంగా కొనసాగుతోంది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తీసిన 'హనుమాన్' కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు... ఉత్తరాదిలో హిందీ ప్రజలను సైతం అమితంగా ఆకట్టుకుంది. 'హనుమాన్' హిందీ వెర్షన్ కలెక్షన్స్ చూస్తే... ఫుల్ రన్ పూర్తి అయ్యేసరికి పాతిక కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు.


'హనుమాన్' హిందీ కలెక్షన్స్ @ 20 కోట్లు!
'హనుమాన్' సినిమాకు హిందీలో ఓపెనింగ్ డే వసూళ్ళతో కంపేర్ చేస్తే... ఐదో రోజు మంగళవారం వచ్చిన కలెక్షన్స్ ఎక్కువ. హిందీలో ఐదు రోజుల్లో ఈ సినిమా రూ. 18.77 కోట్లు కలెక్ట్ చేసింది. బుధవారం కలెక్షన్స్ యాడ్ చేస్తే... ఈజీగా రూ. 20 కోట్లు దాటడం గ్యారంటీ.


Also Readకనుమ రోజూ కింగ్ జోరు - మూడు రోజుల్లో 'నా సామి రంగ' కలెక్షన్స్ ఎంతంటే?






హిందీలో టాప్ 20లోకి ఎంటరైన 'హనుమాన్' 
హిందీలో డబ్బింగ్ అయిన సౌత్ ఇండియా సినిమాల లిస్టు తీస్తే... అందులో టాప్ 10లో 'బాహుబలి 2', 'కెజియఫ్ 2', 'ఆర్ఆర్ఆర్', '2.0', 'సలార్', 'సాహో', 'బాహుబలి 1', 'పుష్ప', 'కాంతార', 'కెజియఫ్' సినిమాలు ఉన్నాయి. 


టాప్ 11 ప్లేసులో నిఖిల్ సిద్ధార్థ్ 'కార్తికేయ 2' ఉంది. ఆ తర్వాత కూడా రజనీకాంత్, విజయ్, ప్రభాస్, విక్రమ్ సినిమాలు ఉన్నాయి. ప్రజెంట్ టాప్ 18 ప్లేసులో తేజ సజ్జ 'హనుమాన్' ఉంది. రోజు రోజుకూ ఈ సినిమా పైకి వస్తుంది. రిపబ్లిక్ డే (జనవరి 26) వరకు హిందీలో పెద్ద సినిమాలు లేవు. ప్రజెంట్ 'హనుమాన్' జోరు చూస్తుంటే రూ. 50 కోట్ల క్లబ్బులోకి చేరే అవకాశాలను కొట్టి పారేయలేం. రూ. 50 కోట్లు వస్తే హిందీలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన డబ్బింగ్ మూవీస్ లిస్టులో టాప్ 10లోకి 'హనుమాన్' చేరుతుంది. ప్రజెంట్ టాప్ 10 ప్లేసులో రూ. 44 కోట్లతో 'కెజియఫ్' ఉంది. హిందీలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా హీరోలను చూస్తే... తేజ సజ్జ అందరి కంటే చిన్నోడు. 


ఆల్రెడీ వంద కోట్లు కలెక్ట్ చేసిన 'హనుమాన్'
'హనుమాన్' సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వచ్చాయి. సినిమా బడ్జెట్ రూ. 25 కోట్లు అయితే అంతకు నాలుగు రేట్లు కలెక్ట్ చేసిందీ సినిమా. ఆల్రెడీ రూ. 100 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ వసూళ్లు 4 మిలియన్ డాలర్స్ వచ్చాయి. అక్కడ టాప్ 10లో సినిమా ఎంటరైంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ప్రజెంట్ జోరు చూస్తుంటే రూ. 200 కోట్లు కలెక్ట్ చేయడం ఈజీ.


Also Read: తెలుగులో శివకార్తికేయన్ 'అయలాన్' రిలీజ్ డేట్ ఫిక్స్