కోలీవుడ్ కథానాయకుడు శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ సినిమా 'అయలాన్'. ఈ సంక్రాంతికి... ఈ నెల 12వ తేదీన తమిళనాడులో విడుదలైంది. తెలుగులో కూడా ఆ తేదీకి విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే... సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం', విక్టరీ వెంకటేష్ 'సైంధవ్', కింగ్ అక్కినేని నాగార్జున 'నా సామి రంగ', తేజ సజ్జ 'హనుమాన్' విడుదలవడంతో శివ కార్తికేయన్ తెలుగులో తన సినిమా విడుదల వాయిదా వేశారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమా తీసుకు వస్తున్నారు.  


ఈ నెల 26న తెలుగులో 'అయలాన్'
Ayalaan Telugu Movie Release Date: శివ కార్తికేయన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'అయలాన్'. ఇందులో ఆయనకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేశారు. హిందీ నటుడు, తెలుగులో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో విలన్ రోల్ చేసిన శరద్ కేల్కర్ కీలక పాత్రలో నటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. రిపబ్లిక్ డే రిలీజ్ అన్నమాట.


తమిళనాడులో వంద కోట్ల వసూళ్లకు...
తమిళనాట 'అయలాన్'కు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఒకవైపు పోటీలో ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' ఉన్నప్పటికీ... ఆ సినిమా కంటే ఎక్కువ శివ కార్తికేయన్ సినిమాకు వస్తుండటం విశేషం. ఆల్రెడీ 'అయలాన్'కు 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఈ వారంలో వంద కోట్లు వసూలు చేయవచ్చని కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో...
సైన్స్ ఫిక్షన్ సినిమాకు భాషలతో సంబంధం లేదు. అన్ని భాషల ప్రేక్షకులకు అది ఇష్టమైన జానర్. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడం, తమిళనాడులో సూపర్ డూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ సినిమా విజయం సాధిస్తుందని చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉంది. 


Also Read: పవన్ కళ్యాణ్ 'ఓజీ' గురించి తమన్ క్రేజీ అప్డేట్


Ayalaan Cast And Crew: 'అయలాన్' సినిమాకు ఆర్. రవి కుమార్ దర్శకత్వం వహించారు. కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా... ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. అయలాన్ అంటే ఏలియన్. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి. 


ఈ సినిమాను గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. జస్ట్ తమిళనాడులో మాత్రమే కాదు... తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అందుకున్న 'వరుణ్ డాక్టర్' తర్వాత హీరో శివ కార్తికేయన్, నిర్మాణ సంస్థలు కెజెఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో వస్తున్న చిత్రమిది.


Also Readకనుమ రోజూ కింగ్ జోరు - మూడు రోజుల్లో 'నా సామి రంగ' కలెక్షన్స్ ఎంతంటే?



ఇషా కొప్పికర్, 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నీరవ్ షా, ఎడిటర్: రూబెన్, సంగీతం: ఏఆర్ రెహమాన్, నిర్మాత: కోటపాడి జె. రాజేష్, దర్శకత్వం: ఆర్. రవికుమార్.