'Indian 2', 'Thangalaan': Netflix unveils post-theatrical Tamil film slate : ఇండియాలో నంబర్ వన్ ఓటీటీగా పేరుగాంచిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు సౌత్ మూవీస్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. గత కొద్ది కాలంగా స్టార్ హీరోల సినిమాల ఓటీటీ రైట్స్ విషయంలో ఎంతటి పోటీ ఉన్నా నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు ఆ రైట్స్ ని కొనుగోలు చేస్తూ వస్తోంది. అలా ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంటున్న నెట్ఫ్లిక్స్ ఈ ఏడాది అన్ని భాషల్లో తెరకెక్కుతున్న బడా సినిమాల డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేస్తుంది ఈ క్రమంలోనే 'నెట్ ఫ్లిక్స్ సినిమా పండుగ' పేరుతో తాము కొనుగోలు చేసిన సినిమాల లిస్టుని బయట పెట్టింది.


అలా టాలీవుడ్ నుంచి కొనుగోలు చేసిన కొత్త సినిమాల లిస్ట్ ని ఇటీవల రిలీజ్ చేసింది. ఆ లిస్టులో పుష్ప2, సలార్, దేవర, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అల్లు శిరీష్ బడ్డీ, విజయ్ దేవరకొండ VD 13, DJ టిల్లు సీక్వెల్, NBK 109.. లాంటి సినిమాలు ఉండడం విశేషం. అంటే ఈ సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లోనే రిలీజ్ అవుతాయి. వీటిని పోస్ట్  థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీపీలోకి అందుబాటులోకి తెస్తారు. ఇక ఇప్పుడు కోలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ కూడా బయటపెట్టేసింది నెట్ ఫ్లిక్స్. ఈ లిస్టులో తమిళనాట భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న 'తంగలాన్', 'ఇండియన్ 2' వంటి సినిమాలు ఉండడం విశేషం.






వీటితో పాటూ  కీర్తి సురేశ్‌ నటిస్తున్న 'రివాల్వర్‌ రీటా' 'కన్నివేడి' విజయ్‌ సేతుపతి 'మహారాజా', శివ కార్తికేయన్‌ హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి తెరకెక్కిస్తున్న #SK21 (వర్కింగ్‌ టైటిల్‌) తదితర చిత్రాలు 'నెట్‌ఫ్లిక్స్‌'లోనే స్ట్రీమింగ్‌ కానున్నాయి. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండనుంది. విజయ్ సేతుపతి మహారాజా శివ కార్తికేయన్ 21 తంగలా ఇండియన్ 2.. ఈ నాలుగు సినిమాలు తమిళం తెలుగుతోపాటు కన్నడ మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంటాయని నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. ఇక కోలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా తెరరకెక్కుతున్న విక్రమ్‌ 'తంగలాన్‌' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.






కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. కబాలి మూవీ ఫేమ్ పా. రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు ఇక 'ఇండియన్ 2' విషయానికొస్తే.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. కాజల్‌ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.


Also Read : రికార్డ్ స్థాయిలో ‘దేవర’ ఓటీటీ రైట్స్, మునుపెన్నడూ లేనంతగా!