Devara OTT: ఈరోజుల్లో సినిమాలు విడుదల అవ్వకముందే, అసలు వాటి నుండి ఎలాంటి మేజర్ అప్డేట్ బయటికి రాకపోతే.. దానిని ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ కోసం పోటీ మొదలయిపోతోంది. ఇప్పటికీ ఎన్నో సినిమాల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ‘దేవర’ కూడా యాడ్ అయ్యింది. ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో మూవీ అని తెలియగానే ప్రేక్షకుల్లో విపరీతంగా ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఇందులో ఎన్‌టీఆర్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేయగానే ఫ్యాన్స్ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అప్పటినుండే ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం సంస్థలు పోటీపడ్డాయి. ఫైనల్‌గా ‘దేవర’ ఓటీటీ రైట్స్‌ను రికార్డ్ ప్రైజ్‌తో నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం.


పూర్తిస్థాయి యాక్షన్ డ్రామా..
కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ సినిమా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించి హిట్ కొట్టడం కొరటాల శివ స్టైల్. అలాంటి ఈసారి ఎన్‌టీఆర్‌తో ‘దేవర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలయినప్పటి నుండి కొరటాల ముందు సినిమాల్లో లేని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని ప్రేక్షకులు బలంగా నమ్మడం మొదలుపెట్టారు. పైగా ఇందులో వైలెన్స్ కూడా బాగానే ఉంటుందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. దానికి తగినట్టుగానే తాజాగా విడుదలయిన ‘దేవర’ గ్లింప్స్ కూడా పూర్తి యాక్షన్‌తో ఉంది. 






రూ.100 కోట్లకు పైగా..
‘దేవర’ ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలవ్వడానికి సిద్ధమవుతోంది. ఇంతలోనే ఈ మూవీ ఓటీటీ రైట్స్ గురించి ఆసక్తికర కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ఓటీటీ రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దీనికోసం నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం రూ.155 కోట్లు ఖర్చుపెట్టిందని సమాచారం. థియేటర్లలో ‘దేవర’ విడుదల అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల కావాలని ఒప్పందం కూడా జరిగిందని తెలుస్తోంది. ఇక ఓటీటీ రైట్స్ కోసం రూ.155 కోట్లు ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం కాదని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.






రెండు భాగాలుగా ‘దేవర’..
‘దేవర’ సినిమా ఏ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయ్యిందో.. అమ్ముడుపోయిన ఈ ఓటీటీ రైట్స్ చూస్తే తెలుస్తుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో ఎన్‌టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రంతో జాన్వీ.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక ఇందులో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. ఎన్‌టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా ‘దేవర’ను నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్.. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలయిన చాలా భారీ బడ్జెట్ సినిమాల తరహాలోనే ‘దేవర’ కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ రివీల్ చేశారు.


Also Read: థియేటర్లలో బంధించి హింసను చూపిస్తున్నారు - ‘యానిమల్’పై తమిళ నటుడు బాలాజీ ఘాటు వ్యాఖ్యలు