Hanuman Hindi Movie Collections: బాక్సాఫీస్ బరిలో భారీ సినిమాలను వెనక్కి నెడుతూ... 'హనుమాన్' పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... హిందీలోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులు లిఖిస్తోంది. తేజ సజ్జ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వండర్స్ క్రియేట్స్ చేస్తోంది. ఉత్తరాదిలో రెండు కన్నడ సినిమా రికార్డులను 'హనుమాన్' బ్రేక్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...


హిందీలో 'కెజియఫ్', 'కాంతార' కంటే ఎక్కువ
Hanuman First Week Collection in Hindi: 'హనుమాన్' సినిమాకు ఉత్తరాదిలో అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఉత్తరాదిలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. నార్త్ ఇండియాలో విడుదలైన ఆరు రోజుల్లో 'హనుమాన్' రూ. 21.02 కోట్లు కలెక్ట్ చేసింది. బుధవారం ఈ సినిమాకు రూ. 2.25 కోట్లు వచ్చాయి. గురువారం కలెక్షన్స్ కలిపితే... ఈజీగా 23 కోట్లు వస్తాయి.


Also Read: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ - రిపబ్లిక్ డేకి అనౌన్స్?






యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కెజియఫ్' పార్ట్ 1కు హిందీలో ఫస్ట్ వీక్ 20 కోట్ల లోపే వచ్చాయి. రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'కాంతార'కు కూడా అంతే! హిందీలో డబ్ అయిన సినిమా కలెక్షన్స్ చూస్తే... మొదటి వారంలో 'కెజియఫ్', 'కాంతార'లను 'హనుమాన్' వెనక్కి నెట్టింది. ప్రజెంట్ సినిమా జోరు చూస్తుంటే... త్వరలో ఆ రెండు సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను వెనక్కి నెడుతుందని చెప్పవచ్చు.


Also Readజయరామ్ పెళ్లాంతో సరిగా కాపురం చేసే క్యారెక్టర్లు చేయరా?



హిందీలో టాప్ 20లోకి ఎంటరైన 'హనుమాన్' 
హిందీలో డబ్బింగ్ అయిన సౌత్ ఇండియా సినిమాల లిస్టు తీస్తే... అందులో టాప్ 10లో 'బాహుబలి 2', 'కెజియఫ్ 2', 'ఆర్ఆర్ఆర్', '2.0', 'సలార్', 'సాహో', 'బాహుబలి 1', 'పుష్ప', 'కాంతార', 'కెజియఫ్' సినిమాలు ఉన్నాయి. 


టాప్ 11 ప్లేసులో నిఖిల్ సిద్ధార్థ్ 'కార్తికేయ 2' ఉంది. ఆ తర్వాత కూడా రజనీకాంత్, విజయ్, ప్రభాస్, విక్రమ్ సినిమాలు ఉన్నాయి. ప్రజెంట్ టాప్ 18 ప్లేసులో తేజ సజ్జ 'హనుమాన్' ఉంది. రోజు రోజుకూ ఈ సినిమా పైకి వస్తుంది. రిపబ్లిక్ డే (జనవరి 26) వరకు హిందీలో పెద్ద సినిమాలు లేవు. ప్రజెంట్ 'హనుమాన్' జోరు చూస్తుంటే రూ. 50 కోట్ల క్లబ్బులోకి చేరే అవకాశాలను కొట్టి పారేయలేం. రూ. 50 కోట్లు వస్తే హిందీలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన డబ్బింగ్ మూవీస్ లిస్టులో టాప్ 10లోకి 'హనుమాన్' చేరుతుంది. ప్రజెంట్ టాప్ 10 ప్లేసులో రూ. 44 కోట్లతో 'కెజియఫ్' ఉంది. హిందీలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా హీరోలను చూస్తే... తేజ సజ్జ అందరి కంటే చిన్నోడు.