‘గుంటూరు కారం’ ౩వ రోజు కలెక్షన్స్‌ - ఎన్ని కోట్లు రాబట్టిందంటే!
మ‌హేష్ బాబు-త్రివిక్రమ్‌ 'గుంటూరు కారం' మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపుతోంది. టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల జోరు కనబరుస్తోంది. రోజురోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ సర్‌పైజ్‌ చేస్తుంది. రెండవ రోజుకే వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మూవీ మూడో రోజు కాస్తా డ్రాప్ కనిపించింది. ఫలితంగా మూడు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 164 కోట్ల గ్రాస్‌ చేసినట్టు తాజాగా మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. రెండవ రోజుతో పోలీస్తే మూడో రోజు ఈ మూవీ వసూల్లు పెరిగినట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘శతమానం భవతి 2’ని అనౌన్స్ చేసిన దిల్ రాజు - 2025 సంక్రాంతి పోటీ ఇప్పుడే షురూ!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో నిర్మించిన ‘శతమానం భవతి’ సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా దక్కింది. 2017 సంక్రాంతికి విడుదల అయిన ఈ సినిమా చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, నందమూరి బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’లతో పోటీ పడి మరీ భారీ విజయం సాధించింది. సంక్రాంతి సీజన్‌లో ఎన్ని పెద్ద సినిమాలు విడుదల అయినా కంటెంట్ బాగుంటే చిన్న సినిమాకు కూడా స్కోప్ ఉంటుందని నిరూపించిన సినిమా. ఇప్పుడు ‘శతమానం భవతి’ డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా? ఆ సినిమా సీక్వెల్‌ను నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు మరి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘నా సామిరంగ’ ఫస్ట్ డే కలెక్షన్స్ - రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎంతంటే?
2024 సంక్రాంతి రేసులో ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యేసరికి అసలు అన్ని సినిమాలు ఎలా హిట్ అవుతాయో.. కలెక్షన్స్ ఎలా వస్తాయో.. హీరోలకు నష్టం కలుగుతుందేమో అని మూవీ లవర్స్ ఆందోళన పడ్డారు. కానీ ప్రేక్షకులకు కంటెంట్ నచ్చితే అన్ని సినిమాలో ఒకేసారి హిట్ కూడా అవ్వగలవు అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక సీనియర్ హీరో నాగార్జునకు సంక్రాంతి బాగా కలిసొచ్చే పండగ. సంక్రాంతికి విడుదల చేసిన తన సినిమాలు ఎక్కువశాతం హిట్ టాక్‌నే అందుకుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. ‘నా సామిరంగ’ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ విషయంలో కూడా దూసుకుపోతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘ధర్మం కోసం నిలబడ్డ వారే గెలుస్తారు’ - నెగిటివిటీపై ప్రశాంత్ వర్మ పోస్టు!
2024 సంక్రాంతి సందర్భంగా బరిలోకి దిగిన ‘హనుమాన్’ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. థియేటర్ల సమస్య, డిమాండ్‌కు తగ్గట్లు థియేటర్లు దొరక్కపోవడం ఇలా ఎన్నో రకాలుగా ‘హనుమాన్’ వార్తల్లో ఉంటూ వస్తుంది. కానీ వీటన్నిటినీ దాటి పెద్ద విజయాన్ని సాధించింది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచే దిశగా సాగిపోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందంపై నెలకొన్న నెగిటివిటీ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు. దీని గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘ది రాజా సాబ్’గా వస్తున్న ప్రభాస్ - మారుతి సినిమా ఫస్ట్‌లుక్!
ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా గురించి ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్‌లో కూడా ఎప్పటి నుంచో డిస్కషన్‌ నడుస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ ఇది ప్రభాస్‌కు కొత్తగా ఉంటుందని భావించగా... మరికొందరు ఈ సమయంలో ఈ సినిమా కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. కానీ ఈ సినిమా సైలెంట్‌గా సెట్స్ మీదకు కూడా వెళ్లిపోయింది. కొంత భాగం షూటింగ్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు టైటిల్, ఫస్ట్ లుక్ కూడా ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఈ సినిమాకు ‘ది రాజా సాబ్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)