Naa Saami Ranga First Day Collections: 2024 సంక్రాంతి రేసులో ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యేసరికి అసలు అన్ని సినిమాలు ఎలా హిట్ అవుతాయో.. కలెక్షన్స్ ఎలా వస్తాయో.. హీరోలకు నష్టం కలుగుతుందేమో అని మూవీ లవర్స్ ఆందోళన పడ్డారు. కానీ ప్రేక్షకులకు కంటెంట్ నచ్చితే అన్ని సినిమాలో ఒకేసారి హిట్ కూడా అవ్వగలవు అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక సీనియర్ హీరో నాగార్జునకు సంక్రాంతి బాగా కలిసొచ్చే పండగ. సంక్రాంతికి విడుదల చేసిన తన సినిమాలు ఎక్కువశాతం హిట్ టాక్‌నే అందుకుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. ‘నా సామిరంగ’ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ విషయంలో కూడా దూసుకుపోతోంది.
రెండు రాష్ట్రాల్లో కలిపి..
నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ మూవీ సంక్రాంతి రేసులో దూసుకుపోతోందని ప్రేక్షకులు అంటున్నారు. సంక్రాంతికి ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా అని పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా నాగార్జునకు సంక్రాంతి కింగ్ అని ట్యాగ్ ఇచ్చేశారు. జనవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.4.33 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది ‘నా సామిరంగ’. టాలీవుడ్‌లో ఎంతోకాలంగా సక్సెస్‌ఫుల్ కొరియోగ్రాఫర్‌గా వెలిగిపోతున్న వినయ్ బిన్నీ.. ఈ మూవీతో దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా ఇది తనకు మొదటి సినిమానే అయినా నాగార్జునలాంటి స్టార్ హీరోను బాగా హ్యాండిల్ చేశాడంటూ విజయ్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఆంధ్రలో కలెక్షన్స్ లెక్కలు..
‘నా సామిరంగ’ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే.. నిజాంలో రూ.1.2 లక్షలు, సీడెడ్‌లో రూ.85 లక్షలు, గుంటూరులో రూ.47 లక్షలు, వైజాగ్‌లో రూ.50 లక్షలు, ఈస్ట్‌లో రూ.60 లక్షలు, వెస్ట్‌లో రూ.30 లక్షలు, కృష్ణలో రూ.23 లక్షలు, నెల్లూరులో రూ.18 లక్షలు కలెక్షన్స్‌ను సాధించింది. దీన్ని బట్టి చూస్తే మూవీ మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర సాలిడ్‌గా ప్రారంభమయ్యిందని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ‘నా సామిరంగ’లో చాలాకాలం తర్వాత విలేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు నాగార్జున. కొన్నేళ్ల క్రితం ఇదే లుక్‌లో ఇలాంటి ఒక విలేజ్ స్టోరీతోనే ‘సోగ్గాడే చిన్నినాయన’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ్. అప్పుడు కూడా తన సినిమా మీద నమ్మకంతో సంక్రాంతి రేసులో నిలబెట్టారు. ఇప్పుడు కూడా మరోసారి అదే జరిగింది. సంక్రాంతిపై నాగార్జున పెట్టుకున్న నమ్మకం మరోసారి నిజమయ్యింది.
యాక్టింగ్‌తో అషికా సమాధానం..
విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నా సామిరంగ’లో నాగార్జునకు జోడీగా అషికా రంగనాథ్ నటించింది. కన్నడ భామ అషికా కెరీర్‌లో నాగార్జునలాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం చాలా త్వరగా వచ్చిందని చాలామంది విమర్శించినా.. తన యాక్టింగ్‌తో అందరికీ సమాధానం చెప్పింది. ఇందులో నాగార్జుతో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌లు కూడా హీరోలుగా నటించారు. ఇక అల్లరి నరేశ్‌కు జోడీగా మిర్నా మీనన్ నటించగా.. రాజ్ తరుణ్‌కు జోడీగా రుక్సార్ నటించింది. ‘నా సామిరంగ’లో నాగార్జున పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో.. అల్లరి నరేశ్ పాత్ర కూడా అలాగే గుర్తుండిపోయేలా ఉందని పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి.
Also Read: మాల్దీవ్స్ ట్రిప్‌ను క్యాన్సల్ చేసుకున్న నాగార్జున - ప్రధాని మోడీకి సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు