Konkona Sen Sharma Shocking Comments On Animal: రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. గత డిసెంబర్‌ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో, అదే స్థాయిలో విమర్శలపాలైంది. ఆర్జీవీ లాంటి దర్శకులు సినిమా చాలా బాగుందని ప్రశంసించినా, కొందరు ప్రముఖులు సమాజంలో స్త్రీలను చిన్నచూపు చూసేలా ఉందని విమర్శించారు. తాజాగా ఈ సినిమా గురించి నటి, ఫిల్మ్ మేకర్ కొంకణా సేన్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


పరిమిత హింస, సెక్స్ ఫర్వాలేదు


2009లో కొంకణా సేన్ శర్మ, రణబీర్ జంటగా ‘వేక్ అప్ సిద్’ అనే సినిమాలో నటించారు. అయాన్ ముఖర్జీ తెరెక్కించిన ఈ చిత్రం అప్పట్లోనే రూ. 47 కోట్లు వసూళు చేసింది. తాజాగా తన సహ నటుడి బ్లాక్ బస్టర్ మూవీ మీద స్పందించింది. ఓ వైపు తనకు వెండితెరపై హింస, సెక్స్ ను చూడాలి అనిపించడని చెప్తూనే, మరోవైపు పరిమిత మేరకు ఉండే ఫర్వాలేదని వెల్లడించింది. స్టోరీను జస్టిఫై చేసేంత వరకు హింసచ సెక్స్ ను తెర మీద చూపించడంలో తనకు ఇబ్బంది లేదని చెప్పింది. "తెరపై హింస, సెక్స్ ను చూపించడానికి సరైన కారణం ఉంటే నాకు ఇబ్బంది లేదు. కానీ, కావాలని వాటిని సినిమాల్లో పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నేను ఇప్పటి వరకు ‘యానిమల్’ సినిమా చూడలేదు. నేను ఈ సినిమా గురించి వింటున్న విషయాలను బట్టి ఇది నాకు సూటయ్యే సినిమా కాదు అనిపిస్తుంది. కానీ, లక్షలాది మంది ప్రేక్షకులు చూస్తున్నారు. నా అభిప్రాయం సినిమా మీద పెద్దగా ప్రభావం చూపించదు అనుకుంటున్నాను” అని వెల్లడించింది.  






‘యానిమల్ పార్క్’ పేరుతో సీక్వెల్


రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్‌’ చిత్రంలో  అనిల్‌కపూర్‌, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రి కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ ను బోల్డ్ గా, అత్యంత వయెలెన్స్ తో చూపించారు దర్శకుడు సందీప్. సినిమాను ఇలా కూడా తీయ్యెచ్చా? అని మేకర్స్ లోనే ఓ ప్రశ్న తలెత్తేలా చేశారు. ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ‘యానిమల్ పార్క్’ పేరుతో సీక్వెల్ ను ప్రకటించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.


Read Also: హాలీవుడ్ మూవీలో తెలుగమ్మాయి, 'మీన్ గర్ల్స్’తో సూపర్ సక్సెస్ కొట్టిన మహేశ్ 'బ్రహ్మోత్సం' చిన్నారి