Maruti Suzuki S-Presso Discount Offer: మారుతి సుజుకి డీలర్లు కొంతమంది కంపెనీ అందిస్తున్న కొన్ని మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. అరేనా, నెక్సా షోరూమ్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఆఫర్‌లను క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో పొందవచ్చు. మారుతి ఎస్-ప్రెస్సోపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.
డిస్కౌంట్ ఎంత?
2023 మోడల్ ఎస్-ప్రెస్సో మొత్తం రూ. 50,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇందులో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. 2024 మోడల్‌పై రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 23,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందించారు.
భారతదేశంలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఎక్స్ షోరూమ్ ధర రూ.4.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఏడు రంగులలో అందుబాటులో ఉంది. ఎస్టీడీ, ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ ప్లస్ అనే నాలుగు వేరియంట్‌లలో లాంచ్ అయింది. కారుకు శక్తినివ్వడానికి ఇది 1.0 లీటర్ కే10 పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. దీనిని 5 స్పీడ్ మాన్యువల్. ఏఎంటీ గేర్‌బాక్స్ యూనిట్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా వినియోగదారులు సీఎన్‌జీ వెర్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు.
మైలేజీ
ఎస్-ప్రెస్సో పెట్రోల్ ఎంటీ వేరియంట్ ఎస్టీడీ, ఎల్ఎక్స్ఐ మోడల్స్ 24.12 కిలోమీటర్ల మైలేజ్‌ను, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ ప్లస్ 24.76 కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది. అయితే పెట్రోల్ ఏఎంటీ 25.30 కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది. సీఎన్‌జీ మోడల్ 32.73 కిలోమీటర్ల మైలేజీ అందించనుంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఈ కారు ముఖ్య ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ పవర్డ్ విండోస్, కీలెస్ ఎంట్రీ ఉన్నాయి. సెక్యూరిటీ ఫీచర్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఈబీడీతో కూడిన ఏబీఎస్ ఉన్నాయి.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!