Prasanth Varma Father Video: సంక్రాంతికి 'గుంటూరు కారం', 'హనుమాన్‌', 'సైంధవ్‌', 'నా సామి రంగ' వంటి నాలుగు పెద్ద సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్నాయి. కానీ అందులో ఎక్కువ బజ్‌ సంపాదించుకుంది మాత్రం యంగ్‌ హీరో తేజ సజ్జా హనుమాన్‌ అనడంలో సందేహమే లేదు. ముగ్గురు అగ్ర హీరోలకు గట్టి పోటీగా ఓ కుర్ర హీరో నిలవడమంటే అది డైరెక్టర్‌ పనితనమే అని చెప్పాలి. అంతగా ఆడియన్స్‌ను మెప్పించాడు యంగ్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.


సూపర్‌ మ్యాన్‌ జానర్లో హనుమంతుడు సెంటిమెంట్ వాడి స్టార్ హీరో సినిమాల ఆడియన్స్‌ని సైతం తన సినిమాకు రప్పించేలా చేశాడు ప్రశాంత్‌ వర్మ. తనదైన మేకింగ్‌ స్టైల్‌తో హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. దాంతో ప్రస్తుతం హనుమాన్‌ విడుదలైన అన్ని భాషల్లో దూకుడు చూపిస్తోంది. రోజురోజుకు కలెక్షన్స్‌, థియేటర్లను పెంచుకుంటూ జోరు కనబరుస్తోంది. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ప్రశాంత్‌ వర్మ పనితనం గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా తన కొడుకు సక్సెస్‌ చూసి మురిసిపోయారు ఆయన తండ్రి. సినిమా చూసి థియేటర్ ముందు తన రివ్యూ ఇస్తూ సినిమా తీసింది నా కొడుకే అంటూ గర్వంగా చెప్పుకున్న తీరు ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుంది. 


ఈ సినిమా తీసింది నా కొడుకే: ప్రశాంత్ వర్మ తండ్రి


ఈ సినిమా చూసిన ప్రశాంత్‌ వర్మ తండ్రి థియేటర్‌ బయటక తన రివ్యూ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "హనుమాన్ సినిమా చాలా అద్భుతంగా ఉంది. మూవీలోని ప్రతి క్యారెక్టర్ బాగుంది. నెక్స్ట్ ఏకంగా ‘జై హనుమాన్’ మీదే సినిమా వస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మంచి అనుభూతి కలిగింది. మొదటి సారిగా ఈ సినిమా వల్ల ఇలాంటి అనుభూతి పొందాను. ఈ సినిమా తీసినోడు నా కొడుకే" అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ కొడుకు విజయాన్ని చూసి గర్వపడుతున్న తండ్రి సంతోషం ఆ కళ్లలో కనిపిస్తోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సినిమా చూసిన ఆడియెన్సే ఎంతో​ సంతోషంగా ఫీలవుతుంటే.. ఇక స్వయంగా డైరెక్టర్ తండ్రి ఇంకెంత గర్వపడాలి. అది ఇప్పుడు నేరుగా చూస్తున్నాం' అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు ప్రశాంత్‌ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 



వీఎఫ్‌ఎక్స్ కు పెద్ద పీట వేసి సినిమాలో సహజత్వం మిస్‌ కాలేదంటూ ప్రశాంత్‌ వర్మ మేకింగ్‌ స్టైల్‌ను ఆడియన్స్‌ ప్రెజ్ చేస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్‌తో విజువల్‌ వండర్‌ చూపించారంటున్నారు. టాలీవుడ్‌కు మరో జక్కన్న దొరికాడంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఇక హనుమాన్‌ కలెక్షన్స్‌ విషయానికి వస్తే ఫస్ట్‌డే ప్రపంచవ్యాప్తంగా రూ. 21 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. సెకండ్ డే కూడా అదే జోరు కనబరుస్తూ తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు వసూళ్లు చేసిందని సమాచారం. ఇక హిందీ వెర్షన్‌ కూడా బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ రూ. 2 కోట్లు ఉండగా సెకండ్‌ డే వసూళ్లలో 88 శాతం పెరిగి రూ. 4కోట్ల గ్రాస్‌ చేసినట్టు సినీ విశ్లేషకుల నుంచి సమాచారం.