Guntura Kaaram Collections: మ‌హేష్ బాబు-త్రివిక్రమ్‌ 'గుంటూరు కారం' మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపుతోంది. టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల జోరు కనబరుస్తోంది. రోజురోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ సర్‌పైజ్‌ చేస్తుంది. రెండవ రోజుకే వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మూవీ మూడో రోజు కాస్తా డ్రాప్ కనిపించింది. ఫలితంగా మూడు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 164 కోట్ల గ్రాస్‌ చేసినట్టు తాజాగా మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. రెండవ రోజుతో పోలీస్తే మూడో రోజు ఈ మూవీ వసూల్లు పెరిగినట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.


ఇదిలా ఉంటే ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి పండగకు థియేటర్లో వచ్చింది 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి ముందు నుంచే విపరీతమైన బజ్‌ నెలకొంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ అందుకు భిన్నంగా కలెక్షన్స్‌ రాబడుతోంది. మూడు రోజుల్లోనే రూ. 164 కోట్ల గ్రాస్‌ చేసిన ఈ సినిమా ఎక్కడెక్కడ ఎంత కలెక్ట్‌ చేసింది..షేర్‌ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం!



తెలుగు రాష్ట్రాల్లో మూవీ షేర్లు ఇలా ఉన్నాయి..


ఫ‌స్ట్ వీకెండ్‌ తెలుగు రాష్ట్రాల్లో 'గుంటూరు కారం' మూవీ రూ. 58 కోట్ల వ‌ర‌కు షేర్ చేసినట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నైజాంలో ఫ‌స్ట్ వీకెండ్‌లో అత్య‌ధికంగా రూ. 25 కోట్ల వ‌ర‌కు షేర్ కలెక్షన్స్‌ చేసినట్టు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బిజినెస్‌ ఇలా ఉంది. ఏపీ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 46.25 కోట్ల బిజినెస్ అయినట్టు తెలుస్తోంది. నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు బిజినెస్‌ జరిగినట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొత్తంగా గుంటూరు కారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 102 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో రూ. 9కోట్లు, ఓవర్సీస్‌ హక్కులు రూ. 20 కోట్లు కలిపి మొత్తంగా రూ 132 కోట్ల బిజినెస్‌ అయ్యిందట.  ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా 


మూడో రోజు కలెక్షన్స్‌లో డ్రాప్‌.. అయినా


సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేసిన ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ విడుదల అనంతరం 'గుంటూరు కారం'లో అంత ఘాటూ లేదన్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రం బాగా ఆకట్టుకుందనే టాక్‌ వినిపిస్తుంది. అంతేకాదు ఈ మూవీకి వచ్చిన మిక్స్‌డ్‌ రివ్యూస్‌  ఫస్ట్‌డే సాయంత్రం వరకు పాజిటివ్‌గా మారాయని మూవీ మేకర్స్‌ నాగవంశీ, దిల్‌ రాజు పేర్కొన్నారు. తమ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుందని, కాబట్టి రివ్యూస్‌ పట్టించుకోకుండ థియేటర్‌కు వెళ్లి స్వయంగా సినిమాను ఫీల్‌ అవ్వాలని ఆడియన్స్‌ను కోరారు. ఇదిలా ఉంటే ప్రీ బుకింగ్స్ విషయంలో ‘గుంటూరు కారం’ మూవీ దూసుకుపోయింది. ప్రీ బుకింగ్స్ కారణంగా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. రెండో రోజు కూడా పండగ వీకెండ్ కావడంతో కలెక్షన్స్‌లో అదే జోరు కనబడింది. ఫలితంగా రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.127 కోట్లను కలెక్ట్ చేసింది ఈ గుంటూరోడి సినిమా. ఇక మూడో రోజు కలెక్షన్స్‌లో కాస్తా డ్రాప్‌ కనిపించిన మొత్తంగా రూ. 164 కోట్ల గ్రాస్‌ చేసింది.