TTWR COE CET 2024: తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి 'తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ' 'కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TTWR COE CET)  - 2024' నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతో పాటు, ఉచిత వసతి ఉంటుంది. వీరికి ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 13న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 5 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  విద్యార్థులకు జనవరి 18న లెవల్-1 (ఆబ్జెక్టివ్) పరీక్ష, మార్చి 10న లెవల్-2 (డిస్క్రిప్టివ్) పరీక్షలు నిర్వహింనున్నారు.


వివరాలు..


* తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024


ప్రతిభా కళాశాలలున్న ప్రాంతాలు: టీటీడబ్ల్యూఆర్‌ ఐఐటీ స్టడీ సెంటర్(బి)-రాజేంద్రనగర్; టీటీడబ్ల్యూఆర్‌ సీవోఈ(జి)-వరంగల్; టీటీడబ్ల్యూఆర్‌ సీవోఈ(బి)-ఖమ్మం; టీటీడబ్ల్యూఆర్‌ సీవోఈ(జి)-పరిగి; టీటీడబ్ల్యూఆర్‌ సీవోఈ(బి)-యాకుబ్‌పురా(వరంగల్); టీటీడబ్ల్యూఆర్‌-వనపర్తి(జి); టీటీడబ్ల్యూఆర్‌ సీవోఈ(బి)-నర్సాపూర్ (మెదక్); టీటీడబ్ల్యూఆర్‌ సీవోఈ(జి)-దేవరకొండ; టీటీడబ్ల్యూఆర్‌ సీవోఈ(బి)-మిర్యాలగూడ; టీటీడబ్ల్యూఆర్‌ సీవోఈ(బి)-దమ్మపేట; టీటీడబ్ల్యూఆర్‌ సీవోఈ(జి)-కల్వకుర్తి; టీటీడబ్ల్యూఆర్‌ సీవోఈ(బి)-హుస్నాబాద్; టీటీడబ్ల్యూఆర్‌ సీవోఈ(బి)-కేఎస్‌డీ సైట్ (భద్రాద్రి కొత్తగూడెం).


సీట్ల సంఖ్య: 1140 (ఎంపీసీ-575 సీట్లు, బైపీసీ-565 సీట్లు).


సీట్ల కేటాయింపు: బాలురు-660; బాలికలు-480.


అర్హత: ఈ ఏడాది మార్చిలో పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే పదోతరగతి ఉత్తీర్ణత సాధించాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000; గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 మించకూడదు. ఇంగ్లిష్/తెలుగు మాధ్యమం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


వయోపరిమితి: విద్యార్థుల వయస్సు 31.08.2024 నాటికి 19 సంవత్సరాలకు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200.


ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ (లెవల్-1, లెవల్-2), దరఖాస్తులో విద్యార్థి ఇచ్చిన ప్రాధాన్యం ఆధారంగా సీటు కేటాయిస్తారు.


లెవల్-1 పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు OMR విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎంపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్(20 మార్కులు), మ్యాథ్స్(60 మార్కులు), ఫిజిక్స్(40 మార్కులు), కెమిస్ట్రీ(40 మార్కులు) సబ్జెక్టులకు పరీక్ష ఉంటుంది. అదేవిధంగా బైపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్(20 మార్కులు), మ్యాథ్స్(20 మార్కులు), ఫిజిక్స్(40 మార్కులు), కెమిస్ట్రీ(40 మార్కులు), బయాలజీ(40 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు.


లెవల్-1 పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు లెవల్-2 పరీక్ష నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. లెవల్-1 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులో 1:3 నిష్పత్తిలో విద్యార్థులను లెవల్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్(45 మార్కులు), ఫిజిక్స్(45 మార్కులు), కెమిస్ట్రీ(45 మార్కులు), ఇంగ్లిష్ (15  మార్కులు) సబ్జెక్టులకు పరీక్ష ఉంటుంది. అదేవిధంగా బైపీసీ విద్యార్థులకు బయోసైన్స్ (45 మార్కులు), ఫిజిక్స్(45 మార్కులు), కెమిస్ట్రీ(45 మార్కులు), ఇంగ్లిష్(15 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు.


ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.01.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.02.2024.


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేదీలు: 12.02.2024 - 17.02.2024.


➥ లెవెల్‌-1 స్క్రీనింగ్ పరీక్షతేది: 18.02.2024.


➥ లెవెల్‌-2 స్క్రీనింగ్ పరీక్షతేది: 10.03.2024.


Notification


Online Application


Online Fee Payment


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...