ఒకే ఫ్రేములో చరణ్, అర్జున్ - వరుణ్ తేజ్ వెడ్డింగ్ కాక్‌ టైల్ పార్టీతో పుకార్లకు చెక్!


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... ఇద్దరూ ఒకే వేదికపై కనువిందు చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి పెళ్లి సందడి అందుకు వేదిక అయ్యింది. Varun Tej Lavanya Tripathi Cocktail Party : వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి పెళ్లి సందడి సోమవారం (అక్టోబర్ 30న) మొదలైంది. నిన్న రాత్రి గ్రాండ్ కాక్ టైల్ పార్టీ జరిగింది. అందులో కొత్త జంటతో కలిసి చరణ్, అర్జున్ సందడి చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ముహూర్తం ఎప్పుడో తెలుసా? మరి, హల్దీ & మెహందీ టైమింగ్స్?


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి సందడి షురూ అయ్యింది. సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠితో ఆయన మరికొన్ని గంటల్లో (అంటే రేపు... నవంబర్ 1, బుధవారం నాడు) బంధుమిత్రుల సమక్షంలో ఏడు అడుగులు వేయనున్నారు. ఇటలీలో వరుణ్ లవ్ (Varun Lav) పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఆల్రెడీ పెళ్లి సంబరాలు మొదలు పెట్టారు. నిన్న (అక్టోబర్ 30, సోమవారం నాడు) కాక్ టైల్ పార్టీ జరిగింది. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా మెగా ఫ్యామిలీ హీరోలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరు అయ్యారు. ఇవాళ హల్దీ, మెహందీ వేడుకలు జరుగుతాయి. నవంబర్ 1న పెళ్లి జరుగుతుంది. పెళ్లి ముహూర్తపు ఎప్పుడంటే? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఆహా ఓటీటీలో నవీన్ చంద్ర, స్వాతిల 'మంత్ ఆఫ్ మధు' - డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే?


'కలర్స్' స్వాతి (Swathi Reddy)గా తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మంత్ ఆఫ్ మధు'. ఇందులో ఆమె ప్రేమికుడిగా, భర్తగా యువ హీరో నవీన్ చంద్ర కనిపించారు. శ్రేయా నవేలి మరో ప్రధాన పాత్ర పోషించారు. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


'కీడా కోలా' ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది - బ్రహ్మి, తరుణ్ భాస్కర్ సినిమా ఎలా ఉందంటే?


'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్, కొత్త కథలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన యంగ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'కీడా కోలా'. రానా దగ్గుబాటి సమర్పణలో విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందిన చిత్రమిది. కె. వివేక్ సుధాంషు, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ సంయుక్తంగా నిర్మించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


లావణ్య త్రిపాఠి పెళ్లి చీర, హల్దీ డ్రస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)తో సొట్ట బుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి వివాహానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఆల్రెడీ ఇటలీలో పెళ్లి సందడి మొదలైంది. ఏడు అడుగులు వేయడానికి ముందు మెహందీ, హల్దీ వేడుకలు నిర్వహించనున్నారు. పెళ్లిలో లావణ్య ధరించే చీర, హల్దీ వేడుకలో సందడి చేయబోయే డ్రస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)