Keedaa Cola Telugu Movie First Twitter Review : 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్, కొత్త కథలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన యంగ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'కీడా కోలా'. రానా దగ్గుబాటి సమర్పణలో విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందిన చిత్రమిది. కె. వివేక్ సుధాంషు, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ సంయుక్తంగా నిర్మించారు. 


యునీక్ క్రైమ్ కామెడీగా సినిమాగా 'కీడా కోలా' (Keedaa Cola Movie) తెరకెక్కించారు దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker Dhaassyam). బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్‌, తరుణ్‌ భాస్కర్, 'టాక్సీవాలా' విష్ణు, జీవన్‌ కుమార్‌, రవీంద్ర విజయ్‌, రఘురామ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది. అయితే... ఈ సినిమాను తన స్నేహితులతో పాటు చిత్ర బృందానికి స్పెషల్ షో వేశారు తరుణ్. సినిమా చూసిన వాళ్ళు అందరూ చాలా బావుందని పేర్కొంటున్నారు. 


అన్ లిమిటెడ్ ఫన్... నవ్వడానికి రెడీ అవ్వండి!
Keedaa Cola Review In Telugu : 'కీడా కోలా' చూశానని యంగ్ ప్రొడ్యూసర్ అఖిలేష్ వర్ధన్ ట్వీట్ చేశారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మికా రాజశేఖర్, నరేష్ అగస్త్య, వికాస్ ముప్పాల, దివ్య శ్రీపాద తదితరులు ప్రధాన తారాగణంగా రూపొందిన 'పంచతంత్రం' సినిమాను ఆయన ప్రొడ్యూస్ చేశారు. 'కీడా కోలా' స్పెషల్ ప్రీమియర్ చూశాక... ఆయన ఏం ట్వీట్ చేశారంటే?


''ఇప్పుడే 'కీడా కోలా' చూశా. తరుణ్ భాస్కర్ ఒక అన్ లిమిటెడ్ ఫన్, ఆ మ్యాడ్నెస్ ఫిల్మ్ తీశారు. మనస్ఫూర్తిగా నవ్వడానికి రెడీగా ఉండండి. ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇదే'' అని అఖిలేష్ వర్ధన్ పేర్కొన్నారు. 


Also Read వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ముహూర్తం ఎప్పుడో తెలుసా? మరి, హల్దీ & మెహందీ టైమింగ్స్?






''నిన్న 'కీడా కోలా' చూసే అవకాశం లభించింది. అందరూ కొట్టి సంపుతారు. నువ్వు నవ్వించి నవ్వించి సంపావ్ తరుణ్ భాస్కర్. కల్ట్ ఫిల్మ్ వస్తోంది. ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా హిట్ అవుతుందని నువ్వు కాన్ఫిడెన్స్ చూపించారు. నేను అదే చెబుతున్నా... బొమ్మ బ్లాక్ బస్టర్'' అని మరో నెటిజన్ పేర్కొన్నారు. 






పెయిడ్ ప్రీమియర్ షోలు పెంచాలంటూ డిమాండ్
నవంబర్ 1న సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2లో పెయిడ్ ప్రీమియర్ షో ఒకటి వేస్తున్నారు. పది అంటే పది... బుకింగ్స్ ఓపెన్ చేసిన పది నిమిషాల్లో టికెట్స్ అన్నీ సేల్ అయ్యాయి. మరిన్ని పెయిడ్ ప్రీమియర్లు వేయమని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే భీమవరంలో పెయిడ్ ప్రీమియర్ షో వేయకపోతే సినిమాను బాయ్ కాట్ చేస్తామంటూ ట్వీట్ చేయడం విశేషం. మరికొందరు పెయిడ్ ప్రీమియర్ టికెట్స్ ఉంటే తమకు కావాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. 


Also Read ఒకే ఫ్రేములో చరణ్, అర్జున్ - వరుణ్ తేజ్ వెడ్డింగ్ కాక్‌ టైల్ పార్టీతో పుకార్లకు చెక్!