Lavanya Tripathi Wedding Saree : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)తో సొట్ట బుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి వివాహానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఆల్రెడీ ఇటలీలో పెళ్లి సందడి మొదలైంది. ఏడు అడుగులు వేయడానికి ముందు మెహందీ, హల్దీ వేడుకలు నిర్వహించనున్నారు. పెళ్లిలో లావణ్య ధరించే చీర, హల్దీ వేడుకలో సందడి చేయబోయే డ్రస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?


అమ్మ చీరను లెహంగా మార్చిన లావణ్య
హల్దీ వేడుక కోసం లావణ్యా త్రిపాఠి ఓ లెహంగా డిజైన్ చేయించారు. ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు డిజైన్ చేసిన ఆ లెహంగా స్పెషాలిటీ ఏమిటంటే... లావణ్యా త్రిపాఠి తల్లి చీరతో అది తయారైంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుక ఎప్పటికీ గుర్తు ఉండేలా, మదర్ టచ్ ఉండేలా చూసుకున్నారు లావణ్య. 


పెళ్ళికి కాంచీపురం చీర... అండ్!
పెళ్లి వేడుక కోసం లావణ్యా త్రిపాఠి కాంచీపురం శారీ సెలెక్ట్ చేసుకున్నారు. దానికి స్పెషల్ ఎంబ్రాయిడరీ చేయించారు. సంథింగ్ స్పెషల్ అనేలా ఆ చీర డిజైన్ ఉంటుందట. ఇక, హల్దీ అండ్ పెళ్లి వేడుకల కోసం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను వరుణ్ తేజ్ ధరించనున్నారని తెలిసింది. 


ఈ రోజే హల్దీ వేడుక... రేపు పెళ్లి!
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి సంబరాలు మొదలు అయ్యాయి. అక్టోబర్ 30న.. అనగా నిన్న (సోమవారం) రాత్రి కాక్ టైల్ పార్టీ జరిగింది. ఈ రోజు (అక్టోబర్ 31, మంగళవారం) హల్దీ వేడుక జరుగుతుంది. బుధవారం (నవంబర్ 1న) ఇద్దరూ ఏడు అడుగులు వేయనున్నారు. 


ఇటలీ చేరుకున్న మెగా హీరోలు...
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు వరుణ్, లావణ్య పెళ్లి కోసం మెగా హీరోలు అందరూ ఇటలీ చేరుకున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భార్య స్నేహ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ రోమ్ వెళ్లారు. వరుణ్ తేజ్ తండ్రి, నటుడు నాగబాబు ఈ ఏడాది తన బర్త్ డే (అక్టోబర్ 29)ను ఇటలీలో సెలబ్రేట్ చేసుకున్నారు. 


Also Read నవంబర్‌లో క్రేజీ క్రేజీ ఫిలిమ్స్ - థియేటర్లలో సందడి చేసే సినిమాలు 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా కూడా మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఇటలీ వెళ్లారు. అయితే... ఆయన ఫోటోలు ఇంకా బయటకు రాలేదు. మిగతా మెగా హీరోలు అందరూ సందడి చేస్తున్నారు. చిరంజీవి తన పిల్లలు, మనవరాళ్లు, వియ్యంకుడితో కలిసి దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


నవంబర్ 5న భాగ్య నగరంలో రిసెప్షన్!
పెళ్ళైన నాలుగు రోజులకు కొత్త జంట హైదరాబాద్ వస్తారు. వివాహానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడంతో సిటీలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఆ వేడుకకు ఆల్రెడీ ఆహ్వానాలు పంపారు. ఆ రిసెప్షన్ కంటే ముందు ఇటలీలో చిన్న రిసెప్షన్ జరుగుతుందని టాక్. 


Also Read  'యాత్ర 2'లో చంద్రబాబు నాయుడిగా ఎవరు నటిస్తున్నారో తెలుసా? మహేష్...