తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, ప్రేక్షకులు... ఆ మాటకు వస్తే భారతీయ రాజకీయ నాయకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'యాత్ర 2' (Yatra 2 Movie). మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక నిర్మిస్తున్న చిత్రమిది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా 'యాత్ర 2'ను తెరకెక్కించారు మహి వి రాఘవ్. ఆ చిత్రానికి కొనసాగింపుగా... వైఎస్సార్ ముద్దు బిడ్డ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర 2' తెరకెక్కిస్తున్నారు. ఇందులో తండ్రి మరణం తర్వాత జగన్ నాయకునిగా ఎదిగిన తీరుతో పాటు 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో జ‌రిగిన రాజకీయ ఘటనలు ఉండబోతున్నారు. 


'యాత్ర 2'లో వైయస్సార్ పాత్రలో మమ్ముట్టి మరోసారి కనిపించనున్నారు. వైఎస్ జగన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ హీరో జీవా (Jiiva Hero) నటిస్తున్నారు. వైఎస్ తండ్రి తనయులతో పాటు ఈ సినిమాలో ఇతర ఆంధ్ర రాజకీయ నాయకుల పాత్రలు కూడా ఉన్నాయి. అందులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పాత్ర ఒకటి! ఆ పాత్రకు పాన్ ఇండియా నటుడిని ఎంపిక చేశారు. 


చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్!
Mahesh Manjrekar as Chandrababu Naidu : 'యాత్ర 2' సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ సైతం మొదలైనట్లు తెలిసింది. హిందీ, మరాఠీ సినిమాలతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన... ప్రభాస్ 'సాహో', గోపీచంద్ 'ఒక్కడున్నాడు'తో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు.  






'యాత్ర' విడుదలైన రోజునే 'యాత్ర 2' కూడా!
'నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి... నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అంటూ ప్రచార చిత్రాల్లో చెప్పిన జగన్ డైలాగ్ ప్రజలను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 


Also Read : విదేశాలు వెళ్ళిన వరుణ్ తేజ్ & లావణ్య - పెళ్ళికి నాలుగు రోజుల ముందు!


'యాత్ర' చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేశారు. ఇప్పుడు 'యాత్ర 2'ను కూడా ఆ తేదీకి విడుదల చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న 'యాత్ర 2' విడుదల కానుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : మది, సంగీతం : సంతోష్ నారాయణన్‌. 


Also Read చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial