Chiranjeevi 156th Movie Titled As Vishwambara : ఫాంటసీ జానర్ మెగాస్టార్ చిరంజీవికి కొత్త ఏమీ కాదు. టాలీవుడ్ ఆల్ టైమ్ సూపర్ హిట్ ఫాంటసీ సినిమాల్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' కూడా ఉంటుంది. కమర్షియల్ పరంగా ఆశించిన విజయం సాధించలేదు కానీ 'అంజి' చిత్రానికి కూడా అభిమానులు ఉన్నారు. కొంత విరామం తర్వాత చిరంజీవి మళ్ళీ ఫాంటసీ సినిమా చేస్తున్నారు.
చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ 'బింబిసార'తో వశిష్ఠ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అది టైమ్ ట్రావెల్, ఫాంటసీ జానర్ సినిమా. చిరుతో కూడా ఆయన ఫాంటసీ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారని తెలిసింది.
మెగాస్టార్ 156 సినిమా టైటిల్ 'విశ్వంభర'!
చిరంజీవి 156వ సినిమా కావడంతో దీనిని Mega 156 అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి 'విశ్వంభర' టైటిల్ ఖరారు చేశారని సమాచారం. అన్నట్టు... ఆ పేరుతో ప్రముఖ సాహితీవేత్త, స్వర్గీయ రచయిత సి. నారాయణ రెడ్డి ఓ పుస్తకం రాశారు. విజయ దశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
'విశ్వంభర' సినిమాలో రానా విలన్!
'విశ్వంభర' సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు మెగా ఫ్యామిలీ సన్నిహితుడు, చిరు తనయుడు రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్ రానా దగ్గుబాటి (Rana Daggubati)ని సంప్రదించారని టాక్. ఈ కథ, అందులో పాత్ర విన్న తర్వాత ఆయన కూడా ఓకే చెప్పారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'లో రానా నటించారు. ఇప్పుడు చిరు చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో రజనీకాంత్ సినిమాలో కీలక పాత్ర చేసే అవకాశం అందుకున్నారు.
Also Read : భజన ఆపేసి మంచి సినిమా తీయండి సార్... స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హరీష్ - పవన్ 'ఉస్తాద్' అప్డేట్ కూడా!
ఆల్రెడీ మెగా 156 సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆస్కార్ పురస్కార గ్రహీతలైన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్... దర్శకుడు వశిష్ఠ, చిరంజీవి మధ్య చర్చలు జరిగాయి. సెలబ్రేషన్ సాంగ్ రికార్డ్ చేస్తున్నామని వివరించారు.
Also Read : జైల్లో రజనీకాంత్ 'జైలర్' విలన్ వర్మ అలియాస్ వినాయకన్ - మద్యం మత్తులో గొడవ గొడవ
ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ : ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుశ్మితా కొణిదెల, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్ : శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు, సంగీతం : ఎంఎం కీరవాణి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial