చాలా మంది చాలా సందర్భాల్లో కొన్ని విషయాలను మర్చిపోతుంటారు. బాగా తెలిసిన విషయమే అయినా, కన్ఫ్యూజ్ అవుతుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ మినహాయింపు ఏమీ కాదు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తాను తాజాగా నటిస్తున్న సినిమా పేరునే మర్చిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక పవర్ స్టార్ మతిమరుపై నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు.


సినిమా పేరు మర్చిపోయిన పవన్ కల్యాణ్


తాజాగా పవన్ కల్యాణ్ ఓ ఎంటర్​ టైన్ మెంట్​ ఛానల్ లాంఛ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాజకీయాల నుంచి సినిమాల వరకు చాలా విషయాలను ప్రస్తావించారు. అందులో భాగంగానే తాను నటిస్తున్న 'ఉస్తాద్​ భగత్ సింగ్' మూవీ గురించి మాట్లాడారు. కన్ఫ్యూజన్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనకుండా 'సర్దార్​ భగత్ సింగ్' అని అన్నారు. స్టేజి దగ్గర ఉన్నవాళ్లు 'ఉస్తాద్' అని చెప్పడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' అని సరి చేసుకున్నారు. మొత్తంగా తాను నటిస్తున్న సినిమా పేరునే మర్చిపోయారు పవర్ స్టార్. ప్రస్తుతం పవర్ స్టార్ కన్ఫ్యూజన్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు జోరుగా ట్రోల్ చేస్తున్నారు. ఫన్నీ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ కు ట్యాగ్ చేస్తున్నారు. సినిమా పేరు మర్చి పోవడం నిజంగా అవమానం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  


దర్శకుడు హరీష్ శంకర్ ఏమన్నారంటే?


అటు పవర్ స్టార్ కన్ఫ్యూజన్ అంశంపై దర్శకుడు  హరీష్ శంకర్ స్పందించారు. అవమానం ఏమీ లేదన్నారు. ఈ కన్ఫ్యూజన్ కు అవమానం అనే పెద్ద పదం వాడటం అవసరం లేదన్నారు. ఫర్వాలేదు, గుర్తు చేయడానికి, గుర్తుండిపోయే సినిమా తీయడానికి మేమంతా కష్టపడుతున్నామని చెప్పారు. హరీష్ శంకర్ చేసిన ఈ ట్వీట్ కు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. మీరు ఎంత గుర్తుండిపోయే సినిమా తీసినా ముందు ఆయన చూడాలిగా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్ కు హరీష్ శంకర్ మళ్లీ స్పందించారు. “ఆయన చూడ్డానికి కాదు,  ఆయనను చూపించడానికి తీస్తున్నాం” అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ​మీరు ఎన్ని చెప్పినా, చేస్తున్న సినిమా పేరు మర్చిపోవడం దారుణం అని నెటిజన్లు హరీష్ శంకర్ కు కామెంట్స్ పెడుతున్నారు.





  






ఇక ‘గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ గెటప్ లో కనిపించనున్నారు. క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  


Read Also: రామ్ లీలా మైదానంలో రావణ దహణం, సరికొత్త చరిత్ర సృష్టించిన కంగనా రనౌత్, కానీ ఓ అపశ్రుతి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial