Harish Shankar Viral Tweets Replies : దర్శకుడు హరీష్ శంకర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయన చాలా ఓపెన్ కూడా! ఎవరైనా నోరు జారితే గట్టిగా బదులు ఇస్తారు. సినిమాల్లో ఆయన డైలాగులు మాత్రమే కాదు... సోషల్ మీడియాలో వేసే ట్వీటుల్లో కూడా పంచ్  ఉంటుంది. విజయ దశమి నాడు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులకు 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్డేట్స్ ఇవ్వడంతో పాటు విమర్శలు చేసిన వాళ్ళకు తనదైన శాలిలో బదులు ఇచ్చారు. 


త్వరలో 'ఉస్తాద్...' విడుదల తేదీ
Ustaad Bhagat Singh Release Date : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన వీరాభిమానులలో ఒకరైన హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత పవన్, హరీష్ కలయికలో వస్తున్న చిత్రమిది. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామని హరీష్ శంకర్ తెలిపారు. 


'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఓజీ' తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్'ను విడుదల చేయడమని ఓ నెటిజన్ కోరగా... అది మన చేతుల్లో లేదని హరీష్ శంకర్ చెప్పారు. ఓజీలో పవన్ యాంగర్ చూడటం కోసం తాను కూడా ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. 'ఉస్తాద్....' ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని ఆయన అన్నారు. 






'ఎంత గుర్తు ఉండిపోయే సినిమా తీసినా ముందు ఆయన చూడాలి'గా అని ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అందుకు బదులుగా ''ఆయన చూడ్డానికి కాదు... ఆయనను చూపించడానికి తీస్తున్నా'' అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఇక్కడ ఆయన అంటే పవన్ కళ్యాణ్ అన్నమాట. 


Also Read అగ్ర నిర్మాతకు శ్రీ లీల కండిషన్ - పవన్, మహేష్ కోసం పక్కన పెట్టారా?






కాంపిటీషన్ కాదు... సెలబ్రేషన్!
'ఓజీ' కన్నా ముందు 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల చేయడం మంచిదని ఓ నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 'ఓజీ' విడుదలైన తర్వాత అంచనాలు మరింత పెరుగుతాయని అన్నాడు. అప్పుడు హరీష్ శంకర్ ''నా ఫీలింగ్ ఏంటంటే... ఇది కాంపిటీషన్ కాదు, సెలబ్రేషన్'' అని రిప్లై ఇచ్చారు.


'ఉస్తాద్ భగత్ సింగ్' ఫ్యామిలీ, యూత్ & మాస్ ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ అని హరీష్ శంకర్ తెలిపారు. నిజం చెప్పాలంటే... 'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేకా? స్ట్రెయిట్ సినిమానా? అని చాలా మందిలో సందేహం ఉంది. ఆ విషయాన్ని అడిగితే తనపై నమ్మకం ఉంచమని, అభిమానుల అంచనాలకు మించి సినిమా ఉంటుందని హరీష్ శంకర్ చెప్పారు. 


మీరూ తమిళ ప్రేక్షకుల్ని చూసి నేర్చుకోవాలి!
'మీరు కొంచెం భజన ఆపేసి మంచి సినిమాలు తీయండి! తమిళ దర్శకుల్ని చూసి నేర్చుకోండి' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అప్పుడు హరీష్ శంకర్ ''ఇప్పుడు దేశం అంతా తెలుగు దర్శకుల వైపు చూస్తోంది. మీరు కూడా తమిళ ప్రేక్షకుల్ని చూసి నేర్చుకోవాలి బ్రో'' అని ఘాటుగా బదులు ఇచ్చారు.  






Also Read శర్వానంద్, కృతి శెట్టి సినిమా టైటిల్ మారుతోందా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial