Bhagavanth Kesari Sequel : 'భగవంత్ కేసరి' సినిమాతో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త అడుగు వేశారని ప్రేక్షక లోకం, అభిమాన గణం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. మాస్ ఫాలోయింగ్, ఇమేజ్, స్టార్ స్టేటస్ పక్కన పెట్టి మరీ సినిమా చేశారు. అడవి బిడ్డ నెలకొండ భగవంత్ కేసరి పాత్రలో ఆడ బిడ్డలు అందరిలో ధైర్యాన్ని నింపే సినిమా చేశారని చెబుతున్నారంతా! 


పతాక సన్నివేశాలు అంటే మాస్, కమర్షియల్ హీరో ఫైట్ చేయడం కంపల్సరీ! కానీ, 'భగవంత్ కేసరి'లో అందుకు భిన్నంగా హీరోయిన్ శ్రీ లీల చేత ఫైట్ చేయించారు. అసలు, ఆ నిర్ణయానికి బాలకృష్ణ మద్దతు పలకడంలో హీరోయిజం ఉందని ప్రేక్షక లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే? అభిమానులు కొందరిలో చూడాలని ఆశ. మరి, దర్శకుడు అనిల్ రావిపూడి ఏమంటున్నారో విన్నారా?


అంత ధైర్యం లేదు కానీ...
''ఈ సినిమా (భగవంత్ కేసరి)కి రెండో పార్ట్ (సీక్వెల్) తీసే ధైర్యం లేదు. చూడాలి. ఈ సినిమాలో 'భగవంత్ కేసరి'ని పూర్తిగా ఎలివేట్ చేశాం. ఈ సినిమా కోసం నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ఈ బరువు మీద వేసుకున్నందుకు చాలా నలిగిపోయా. సీక్వెల్ చేయగలనో? లేదో? చూడాలి. బాలయ్య బాబు 'నువ్వు కొట్టు నాన్న 2. నీ వెనుక నేను ఉన్నా' అన్నారనుకోండి... కొట్టేస్తా'' అని అనిల్ రావిపూడి చెప్పారు. 


'భగవంత్ కేసరి' సినిమా చేసేటప్పుడు బాలకృష్ణతో చేసిన ప్రయాణం ఎప్పటికీ మరువలేనని అంతకు ముందు అనిల్ రావిపూడి చెప్పారు. ఆయనతో మరో సినిమా తప్పకుండా చేస్తానని అన్నారు. అదీ సంగతి!  



అయ్యోరు రూపంలో ఉన్న అమ్మోరు బాలయ్య
'భగవంత్ కేసరి' సక్సెస్ సెలబ్రేషన్స్ (Bhagavanth Kesari Success Celebrations)లో బాలకృష్ణపై అనిల్ రావిపూడి ప్రశంసల వర్షం కురిపించారు. స్టేజి మీద మోకాళ్ళ మీద కూర్చుని మరీ బాలకృష్ణకు ఆయన సలామ్ చేశారు. కథను యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి సినిమా విడుదల అయ్యే వరకు తనకు ఎంతో ఫ్రీడమ్, కంఫర్ట్ ఇచ్చారని చెప్పారు. తమ వెనుక ఉండి నడిపించిన వ్యక్తి, అయ్యోరు రూపంలో ఉన్న అమ్మోరు బాలకృష్ణ అని ఆయన చెప్పుకొచ్చారు.  ఆయన ఒక గొప్ప శక్తి అని అన్నారు. అంతకు మించి చెప్పడానికి తనకు మాటలు రావడం లేదన్నారు. నిజ జీవితంలోనూ నందమూరి బాలకృష్ణలా ఎవరూ ఉండలేరని అనిల్ రావిపూడి తెలిపారు.


Also Read 'దిల్' రాజుతో బాలకృష్ణ సెంచరీ మిస్ - అయితే అతి త్వరలో!  


'భగవంత్ కేసరి' సినిమాలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించారు. శ్రీ లీల కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. 


Also Read  అగ్ర నిర్మాతకు శ్రీ లీల కండిషన్ - పవన్, మహేష్ కోసం పక్కన పెట్టారా?   



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial