Balakrishna Dil Raju Movie : 'దిల్' రాజుతో బాలకృష్ణ సెంచరీ మిస్ - అయితే అతి త్వరలో!

బాలకృష్ణ, 'దిల్' రాజు కలయికలో అతి త్వరలో ఓ సినిమా రానుంది. అసలు, ఇంతకు ముందు వాళ్ళిద్దరూ ఓ సినిమా చేయాల్సింది. అయితే... అది మిస్ అయ్యింది. ఆ సినిమా ఏది? అప్పుడు దర్శకుడు ఎవరు? వంటి వివరాల్లోకి వెళితే

Continues below advertisement

Balakrishna New Movie : గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' విజయ దశమి సందర్భంగా విడుదలైంది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా కంటే ముందు బాలకృష్ణ హీరోగా సినిమా చేయాలని అనిల్ రావిపూడి ట్రై చేశారు. ఆ సినిమా ఏది? అప్పుడు నిర్మాత ఎవరు? అంటే... 

Continues below advertisement

'దిల్' రాజుతో బాలకృష్ణ సెంచరీ మిస్!
దర్శకుడు అనిల్ రావిపూడి మొదటి సినిమా 'పటాస్', ఇప్పుడీ 'భగవంత్ కేసరి' సినిమా మినహా మిగతా అన్ని సినిమాలు 'దిల్' రాజు నిర్మాణంలో తెరకెక్కినవే. బాలకృష్ణతో అనిల్ రావిపూడి, 'దిల్' రాజు ఓ సినిమా చేయాలని అనుకున్నారు. అసలు వివరాల్లోకి వెళితే... 

బాలకృష్ణకు 'భగవంత్ కేసరి' 108వ సినిమా! దీనికి ఎనిమిది సినిమాల ముందు ఆయన దగ్గరకు 'దిల్' రాజు, అనిల్ రావిపూడి వెళ్లారు. బాలకృష్ణ వందో సినిమా చేయాలని ట్రై చేశారు. అయితే... ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. వాళ్ళ కాంబినేషన్ కుదరలేదు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా చేశారు. ఇప్పుడు బాలకృష్ణతో అనిల్ రావిపూడి 'భగవంత్ కేసరి' చేశారు. మరి, 'దిల్' రాజు ఎప్పుడు చేస్తారు? అంటే... అతి త్వరలో అని చెప్పాలి. 

దర్శకుడిని ఫైనలైజ్ చేసిన బాలకృష్ణ!
'భగవంత్ కేసరి' విజయం సాధించిన సందర్భంగా అనిల్ రావిపూడి, శ్రీ లీలను 'దిల్' రాజు ఇంటర్వ్యూ చేశారు. అందులో బాలకృష్ణ వందో సినిమా మిస్ అయిన విషయం వెల్లడించారు. అయితే... త్వరలో తమ కలయికలో సినిమా ఉంటుందని 'దిల్' రాజు చెప్పారు. ''నేను 'చెన్నకేశవ రెడ్డి' సమయంలో బాలకృష్ణ గారిని కలిశా. ఆ తర్వాత కలిసింది చాలా తక్కువ. ఈ మధ్య ఎక్కువ కలుస్తున్నాం. త్వరలో ఆయనతో సినిమా ఉంటుంది. దర్శకుడిని ఆయన సూచించారు. అన్నీ కుదిరిన తర్వాత సినిమా అనౌన్స్ చేస్తాం'' అని 'దిల్' రాజు వివరించారు. అయితే... దర్శకుడు ఎవరు? అనేది మాత్రం ఆయన చెప్పలేదు. సస్పెన్సులో ఉంచారు.  

Also Read అద్దంలో నన్ను నేను చూసుకుని గుర్తుపట్టలేదు - బాలకృష్ణ

అన్నట్టు... 'భగవంత్ కేసరి' సినిమాలో 'దిల్' రాజు భాగమే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా వసూళ్ళలో కీలమైన నైజాం ఏరియాలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. అనిల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్ 2 : ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్', 'ఎఫ్ 3' సినిమాలు వాళ్ళ కాంబినేషన్లో వచ్చాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు'ను మరొక నిర్మాతతో కలిసి తీశారు.     

Also Read వెనక్కి తగ్గేది లేదు - ప్రభాస్‌తో పోటీలో ఒక్క రోజు ముందుకు షారుఖ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola