Varun Tej Lavanya Tripathi Wedding : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి సందడి షురూ అయ్యింది. సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠితో ఆయన మరికొన్ని గంటల్లో (అంటే రేపు... నవంబర్ 1, బుధవారం నాడు) బంధుమిత్రుల సమక్షంలో ఏడు అడుగులు వేయనున్నారు.


ఇటలీలో వరుణ్ లవ్ (Varun Lav) పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఆల్రెడీ పెళ్లి సంబరాలు మొదలు పెట్టారు. నిన్న (అక్టోబర్ 30, సోమవారం నాడు) కాక్ టైల్ పార్టీ జరిగింది. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా మెగా ఫ్యామిలీ హీరోలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరు అయ్యారు. ఇవాళ హల్దీ, మెహందీ వేడుకలు జరుగుతాయి. నవంబర్ 1న పెళ్లి జరుగుతుంది. పెళ్లి ముహూర్తపు ఎప్పుడంటే?


ఉదయం 11 గంటల నుంచి హల్దీ వేడుక
మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి హల్దీ వేడుక జరగనుంది. దాంతో పాటు పూల్ పార్టీ కూడా! ఇది థీమ్ పార్టీ! ఈ వేడుకలో అందరూ ఎల్లో, వైట్, పింక్ కలర్ దుస్తులు ధరిస్తారు. లావణ్యా త్రిపాఠి హల్దీ సెర్మనీలో ధరించే డ్రస్ (Lavanya Tripathi haldi ceremony dress speciality)కు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే తెలుస్తుంది.


Also Read : లావణ్య త్రిపాఠి పెళ్లి చీర ఎక్కడిది? హల్దీ డ్రస్ స్పెషాలిటీ ఏంటి? దానికి, లావణ్య తల్లికి సంబంధం ఏమిటి?


సాయంత్రం ఐదున్నర నుంచి మెహందీ వేడుక!
హల్దీ (పసుపు కుంకుమ) వేడుక పూర్తి అయిన తర్వాత కొంతసేపు కొత్త జంటతో పాటు బంధుమిత్రులు అందరూ విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం ఐదున్నరకు మెహందీ వేడుక మొదలు కానుంది. దీనికి ఓ డ్రస్ కోడ్ ఉంది. అలా అని ఫలానా రంగు దుస్తులు మాత్రమే ధరించాలని ఏమీ నియమం పెట్టలేదు. వైబ్రెంట్ కలర్ దుస్తులు వేసుకుని రావాలని వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి కోరారు. 


పెళ్లి ముహూర్తం ఎప్పుడు? రిసెప్షన్?
Varun Tej Lavanya Tripathi Wedding Muhurtham : వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి ఒక్కటి అయ్యే పెళ్లి ముహూర్తం బుధవారం (నవంబర్ 1) మధ్యాహ్నం 2.48 గంటలకు. పెళ్లి ముగిసిన తర్వాత రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి రిసెప్షన్ జరుగుతుంది. పెళ్లికి పాస్టెల్స్, రిసెప్షన్ కోసం గ్లిట్జ్ అండ్ గ్లామ్ దుస్తులు ధరించాలని కోరారు. అదీ సంగతి!


Also Read : ఒకే ఫ్రేములో చరణ్, అర్జున్ - వరుణ్ తేజ్ వెడ్డింగ్ కాక్‌ టైల్ పార్టీతో పుకార్లకు చెక్!