Sajjala on Babu Bail : చంద్రబాబునాయుు విడుదల పై టీడీపీ సంబరాలు చేసుకోడానికి సిగ్గుండాలని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన అంశంపై ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. . నిజం ఎక్కడ గెలిచింది? స్కిల్ స్కామ్ జరగలేదా..? పెండ్యాల శ్రీనివాస్ పారిపోవడానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. కంటి ఆపరేషన్ చేయించుకోవడం కోసం బెయిల్ మంజూరు చేశారు. వ్యవస్థను మేనేజ్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు బయటికీ ఎలా వచ్చారు. నువ్వు రోగీవా..? వీర యోధుడివా అని ప్రశ్నించారు. చంద్రబాబు కేసు మెరిట్ చర్చ జరిగిందా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పించుకోవడానికి వీలు లేదు. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేశారని సజ్జల ఆరోపించారు. రాజమండ్రి నుంచి ర్యాలీ నిర్వహిస్తామని అంటున్నారని ప్రజలు ఏమనుకుంటారని సజ్జల ప్రశ్నించారు.
మధ్యంతర బెయిల్ రాగానే నిజం గెలిచినట్టా అని సజ్జల ప్రశ్నించారు. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తారని సజ్జల విమర్శించారు. స్కిల్ కేసులో డబ్బులు షెల్ కంపెనీలకు దారి మళ్లాయా? లేదా అని ప్రశ్నించారు. సానుభూతి కోసం బెయిల్ తెచ్చుకుని.. జనాలకు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. నిజంగా చంద్రబాబు అనారోగ్యంగా ఉంటే చికిత్స చేయించుకోవాలని అన్నారు. చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందేనని చెప్పారు. చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌పై స్పందించాల్సిన అంశమే కాదన్నారు.. ఇది కేవలం ఆరోగ్య కారణాల పై ఇచ్చిన మధ్యంతర బెయిల్.. చెప్పుకోవటానికి కూడా న్యూసెన్స్ గా ఉండే చర్మ వ్యాధులు చంద్రబాబుకు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇక, చంద్రబాబుకు ఉన్న చర్మ వ్యాధులను ప్రాణాంతకం అన్నట్లు చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.. మధ్యంతర బెయిల్ వచ్చిందని సంబరాలు చేసుకునే వారికి సిగ్గు ఉందా? అంటూ మండిపడ్డారు. కేసు మెరిట్ చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. వ్యవస్థలను మేనేజ్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు బయటకు ఎలా వస్తాడు? అని ప్రశ్నించారు. . ఇప్పుడు మధ్యంతర బెయిల్ రావటమే మాకు వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు లేదు అనటానికి ఉదాహరణగా పేర్కొన్నారు.
చంద్రబాబుకు బెయిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి. లయన్ ఈజ్ బ్యాక్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు జైల్లో ఉన్నా.. బయట ఉన్నా పెద్ద తేడా ఉండదన్నారు. బయట ఉంటేనే పొలిటికల్ ఫైట్ ఉంటుందన్నారు.