Prince Movie Update, Sunny Leone Naach Baby Song : కొత్త పాటలు, కబుర్లతో వచ్చిన శృంగార తార సన్నీ లియోన్, శివ కార్తికేయన్, కృతి శెట్టి, 'బిగ్ బాస్' సోహైల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? లేటెస్ట్ న్యూస్, గాసిప్స్, అప్‌డేట్స్‌ను ABP Desam లైవ్ పేజీ ద్వారా మీ ముందుకు తీసుకు వస్తోంది.

ABP Desam Last Updated: 30 Aug 2022 05:42 PM
'ప్రిన్స్' ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Sivakarthikeyan and Anudeep KV's Prince Movie First Single On September 1st : శివ కార్తికేయన్ హీరోగా 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ప్రిన్స్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సునీల్ నారంగ్ (నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో), డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తొలి పాటను సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 





కొత్త పాటతో సన్నీ లియోన్ రెడీ - చూడటానికి మీరు రెడీనా?

Sunny Leone's Naach Baby Musical Video To Release On September 6th : శృంగార తార సన్నీ లియోన్ కొత్త పాటతో రెడీ అయ్యారు. 'నాచ్ బేబీ' అంటూ సాగే ఆ గీతంలో రేమో డిసౌజాతో కలిసి స్టెప్పులు వేశారు. ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ రోజు ఆ సాంగ్ పోస్టర్ విడుదల చేశారు.  





మోనికా డార్లింగ్.... నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్ ఫిల్మ్ టీజర్ వచ్చిందోచ్

Monica O My Darling Teaser Out Now : రాజ్ కుమార్ రావు, హ్యుమా ఖురేషి, రాధికా ఆప్టే, ఆకాంక్షా రంజన్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మోనికా ఓ మై డార్లింగ్'. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ కోసం రూపొందించారు. త్వరలో విడుదల కానుంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. అంగోలా అనే స్మాల్ టౌన్ నుంచి వచ్చిన ఓ హీరో, ముగ్గురు మహిళలతో పరిచయం ఎలా ఏర్పడింది? అనేది కథగా తెలుస్తోంది. 


కృతి శెట్టిలో ఆ మెరుపేమిటో చూశారా?

Here Is Aa Merupemito song from Aa Ammayi Gurinchi Meeku Cheppali starring Sudheer Babu and Krithi Shetty : సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని 'ఆ మెరుపేమిటో' పాటను ఈ రోజు విడుదల చేశారు. వివేక్ సాగర్ సంగీతం అందించగా... 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మహేంద్ర, కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 16న ఈ సినిమా (Aa Ammayi Gurinchi Meeku Cheppali Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది.  


బిగ్ బాస్' సోహైల్ సినిమా 'లక్కీ లక్ష్మణ్'లో కొత్త పాట చూశారా?

Oo Meri Jaan Song From Bigg Boss Sohel's 'Lucky Lakshman' movie unveiled : 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోహైల్ హీరోగా నటిస్తున్న సినిమా 'లక్కీ లక్ష్మన్'. దత్తాత్రేయ మీడియా పతాకంపై ఎ.ఆర్ అభి దర్శకత్వంలో, హరిత గోగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోక్ష హీరోయిన్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఈ సినిమాలో 'ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే...' సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 3న విడుదల కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతంలో భాస్కరభట్ల రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. 


అవికా గోర్ ఇంట విషాదం - ఆమె కుటుంబ సభ్యుల్లో కీలక వ్యక్తి మృతి

Avika Gor Dadi Passed Away : కథానాయిక అవికా గోర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యుల్లో కీలక వ్యక్తి శనివారం మరణించారు. ''మీరిద్దరూ మమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తారని నాకు తెలుసు. స్వర్గంలో కలిసి ఉంటారని ఆశిస్తున్నాను. మా దాది (నానమ్మ) మరణించారు'' అని అవికా గోర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అవికా గోర్ నానమ్మ పేరు మంజులా గోర్. ఆవిడ ఏప్రిల్ 16, 1940లో జన్మించారు. ఆగస్టు 29న తుదిశ్వాస విడిచారు. నానమ్మ, తాతయ్యలతో చిన్నతనంలో దిగిన ఫోటోలను అవికా గోర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.    





నెట్‌ఫ్లిక్స్‌లో దిల్జిత్ దోసాంజ్ 'జోగి' - ట్రైలర్ వచ్చింది

Diljit Dosanjh's Jogi Trailer Out Now, Movie Will Release In Netflix On Sep 16th : పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ హీరోగా నటించిన సినిమా 'జోగి'. సెప్టెంబర్ 16న నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కానుంది. ఈ రోజు మూవీ ట్రైలర్ విడుదల చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత పంజాబ్ లో సిక్కులపై జరిగిన దౌర్జన్యాల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. 





'జల్సా' రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?

Here Is Jalsa Re Release Trailer, 4K Movie Reloading in Theaters on SEP 1st : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'జల్సా' సినిమాను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు. సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి 'జల్సా' 4కె ప్రింట్ తో షోస్ వేస్తున్నారు. ఈ సందర్భంగా మెగా మేనల్లుడు సాయి తేజ్ 'జల్సా' రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ చూడండి   


త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు యాడ్ షూట్

Mahesh Babu Shot A TV Commercial For Mahesh Babu Under Trivikram Srinivas Direction : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల‌ది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరూ కలిసి 'అతడు', 'ఖలేజా' సినిమాలు చేశారు. త్వరలో మూడో సినిమా SSMB28 షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అంత కంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించారు. అదీ ఒక యాడ్ కోసం! హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు మహేష్ బాబు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ కోసం ఈ యాడ్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ ఈ యాడ్ షూట్ చేశారు. 





శ్రుతీ హాసన్‌తో బాలయ్య స్టయిలిష్ పౌట్

Balakrishna and Shruti Haasan from NBK107 Movie Sets : నట సింహం నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం టర్కీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి హీరో హీరోయిన్లు సరదాగా సెల్ఫీ దిగారు. ఆ స్టిల్ ఇదిగో...  





'లైగర్'లో... కలలో కూడా అనుకోలేదు వీడియో సాంగ్ వచ్చిందోచ్

Kalalo Kooda Music Video from Vijay Deverakonda's Liger Telugu movie out now: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'లైగర్'. థియేటర్లలో ఈ సినిమాకు ఆశించిన స్పందన రాలేదు. అయితే... ఏదో రకంగా సినిమా వార్తల్లో నిలుస్తూ ఉంది. లేటెస్టుగా ఈ సినిమా నుంచి 'కలలో కూడా అనుకోలేదు...' వీడియో సాంగ్ విడుదల చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండే మధ్య కెమిస్ట్రీకి రెస్పాన్స్ బావుంది.  


'రంగ రంగ వైభవం'గా సినిమాలో 'సిరి సిరి మువ్వల్లోనా...' సాంగ్ విడుదల

Ranga Ranga Vaibhavanga - Siri Siri Muvvallona Video : 'రంగ రంగ వైభవంగా' సినిమాలో 'సిరి సిరి మువ్వలోనా... ' వీడియో సాంగ్ ఈ రోజు విడుదల చేశారు. వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 'సిరి సిరి మువ్వలోనా... ' పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా... జావేద్ అలీ, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ మెలోడీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. వీడియోలో హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బావుంది.  


వినాయక చవితికి మాస్ మహారాజ 'ధమాకా గ్లింప్స్‌

Ravi Teja's Dhamaka Movie Update : మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాల్లో 'ధమాకా' ఒకటి. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ ఒక సాంగ్ విడుదలైంది. వినాయక చవితి సందర్భంగా రేపు సాయంత్రం ఐదు గంటలకు సినిమా గ్లింప్స్‌ విడుదల చేయనున్నట్లు ఈ రోజు తెలిపారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. 

మహానటి నిర్మాత స్వప్నా దత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Happy Birthday Swapna Dutt : ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె, 'మహానటి' చిత్ర నిర్మాత స్వప్నా దత్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వైయజంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్  విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. స్వప్న సినిమా బ్యానర్ స్టార్ట్ చేసిన స్వప్న, తండ్రి తగ్గ తనయురాలిగా పేరు తెచ్చుకున్నారు. 





వరుణ్ తేజ్, సాయి తేజ్ అతిథులుగా 'రంగ రంగ వైభవంగా' ప్రీ రిలీజ్ వేడుక

Ranga Ranga Vaibhavanga Pre Release Event : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ సిటీలో జరగనుంది. దీనికి ముఖ్య అతిథులుగా యువ మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి తేజ్ రానున్నారు. కేతికా శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాకు గీరీశాయ దర్శకత్వం వహించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో భోగవల్లి బాపినీడు సినిమాను నిర్మించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న సినిమా విడుదల కానుంది. 

ప్రభాస్ 'సాహో' విడుదలై మూడేళ్ళు

Three Years for Rebel Star Prabhas's High-octane Action Spectacle Saaho Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'సాహో' సినిమా విడుదలై నేటికి మూడేళ్ళు. 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలు అందుకోవడంలో సినిమా ఫెయిల్ అయ్యింది. అయితే, ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ... సుమారు 450 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభించింది. 

Background

తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Tollywood ) లో ఏం జరుగుతోంది? తాజా వార్తలు ఏమిటి? ఇతర సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పాఠకులకు తెలియజేయడం కోసం ABP Desam ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ లైవ్ పేజీని తీసుకొచ్చింది.
 
టర్కీలో బాలకృష్ణ
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), శ్రుతీ హాసన్ (Shruti Hassan) జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. హీరో హీరోయిన్ల మీద అక్కడ పాటను తెరకెక్కిస్తున్నారు. మరో పది పదిహేను రోజులు అక్కడ షూటింగ్ జరగవచ్చని సమాచారం.


సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు సినిమా!
ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారని సమాచారం.  అందువల్ల, చిరంజీవి సినిమా వెనక్కి వెళ్ళనుంది. బాలకృష్ణ 107వ సినిమాతో పాటు చిరంజీవి 154 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలయ్య రాకతో సంక్రాంతి బరి నుంచి మెగా154 తప్పుకోవచ్చని ఇండస్ట్రీ గుసగుస.


బాలకృష్ణ సాంగ్ షూటింగ్ గురించి మరింత సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి : టర్కీలో నందమూరి బాలకృష్ణ & శృతి హాసన్


కేఆర్కేను అరెస్ట్ చేసిన పోలీసులు
బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్‌ (Kamal Rashid Khan Arrest) ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.  నేడు ఆయన్ను కోర్టులో హాజరు పరచనున్నారు. 2020లో చేసిన వివాదాస్పద ట్వీట్ కేఆర్కే అరెస్టుకు కారణం అయ్యింది. మరి, దీనిపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


కమల్ ఆర్ ఖాన్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు? 
హిందీ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు, హీరోయిన్లు, నటీనటులతో పాటు భారీ సినిమాలను విమర్శిస్తూ ట్వీట్స్ చేయడం కేఆర్కేకు అలవాటు. రెండేళ్ల క్రితం...  అనగా 2020లో ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అరెస్ట్‌కు కారణం అని తెల్సింది. మహారాష్ట్రలోని ముంబై ఎయిర్ పోర్ట్‌లో దిగిన ఆయనను మలద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేఆర్కేను ఈ రోజు ఉదయం బోరివలీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. 


కేఆర్కేపై గతంలో నమోదైన కేసులు, ఇతర వివరాల గురించి మరింత సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:  హిందీ నటుడు, విమర్శకుడు కేఆర్కేను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు


అప్పుడప్పుడూ తాగుతాను కానీ... తేజస్వి
తేజస్వి మాదివాడ (Tejaswi Madivada) గతంలో 'బిగ్ బాస్' రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు. షోలో కౌశల్ మండ ప్రవర్తన, ఎక్కువ రోజులు ఓకే ఇంట్లో ఉండటం వల్ల ఆమె మద్యానికి బానిస అయినట్టు ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం నిజం లేదని ఆమె ఖండించారు. అప్పుడప్పుడూ తాగుతాను తప్ప మద్యానికి బానిస కాలేదని వివరించారు.


తేజస్వి మాదివాడ తాగుడు, బిగ్ బాస్ గురించి చేసిన వ్యాఖ్యలపై మరింత సమాచారం కోసం ఈ క్లిక్ చేయండి:  'బిగ్ బాస్' వల్ల తాగుడుకు బానిస కాలేదు - పుకార్లపై తేజస్వి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.