AP Gokulam Scheme | అమరావతి: ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా గోకులాలను సంక్రాంతి ఉత్సవాలుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీ నుంచి 12 వరకు ఏపీ వ్యాప్తంగా గోకులాలకు సంక్రాంతి సందర్బంగా ప్రారంభించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయం తీసుకుంది. 


పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్


ఈ మేరకు జనవరి 10వ తేదీన కాకినాడ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించే కార్యక్రమానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారని అధికారులు తెలిపారు.  ఇతర జిల్లాల్లోనూ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో గోకులాలను ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోకులాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లాల కలెక్టర్లు, డ్వామా స్కీమ్ సంచాలకులకు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కృష్ణతేజ మంగళవారం (జనవరి 7న) ఉత్తర్వులు జారీ చేశారు.  


ఉపాధి ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల కోసం ఏపీ ప్రభుత్వం గత ఏడాది అక్టోబరు 14వ తేదీ నుంచి 20 వరకు పల్లె పండగ- పంచాయతీ వారోత్స వాల పేరుతో గ్రామ సభలు నిర్వహించింది. ఆ గ్రామ సభలు గిన్నిస్ రికార్డ్ నెలకొల్పడం తెలిసిందే. తాజా నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో బాగంగా పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లకు షెల్టర్ల కోసం రాయితీలపై రైతులతో గోకులాలను నిర్మించ తలపెట్టింది కూటమి ప్రభుత్వం. 


Also Read: Pinnelli Ramakrishna Reddy: హైకోర్టులో పిన్నెల్లికి ఊరట, అప్పటివరకూ అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలు 


నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రూ.500 కోట్లు
అమరావతి: ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్ అయిందన్న ఆరోపణలు, విమర్శలకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఏపీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రూ.500 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రుల ఆదేశాలతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం నాడు సమావేశం అయ్యారు. వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి బీమా పద్ధతిలో ఎన్టీఆర్‌ వైద్య సేవా (NTR Health Scheme) ఆస్పత్రుల బకాయిలు ఇవ్వాలని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ. 500 కోట్లు ఇస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రకటించారు.