'గరుడ వేగ' అనే సినిమాతో మంచి మార్కులు సంపాదించుకున్న అంజి దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'బుజ్జీ ఇలా రా' .  హాస్యనటులు సునీల్ , ధన్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి  దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ - స్క్రీన్ ప్లే అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకోగా తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్






వరంగల్ నగరంలో వరుస కిడ్నాపులు జరగడంతో పోలీసులు హై టెన్షన్ కు గురవుతున్నట్లు చెప్పడంతో ఈ టీజర్ ప్రారంభమైంది. ఇందులో మహమ్మద్ ఖయ్యుమ్ అనే పోలీస్ గా సునీల్,  సీఐ కేశవ్ నాయుడుగా ధన్ రాజ్ నటిస్తున్నారు.  వరుసగా చిన్నారులు కిడ్నాప్ కావడం, హత్యకు గురికావడంతో హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు మమ్మురంగా గాలిస్తున్నారు. ఈ క్రైమ్స్ కి ఒక పోలీస్ బాధ్యుడని సునీల్ చెప్పగా..దీని  వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని ధనరాజ్ డైలాగ్ ఉంది. సునీల్ - ధనరాజ్ మధ్య ఫైట్ సీన్  కూడా ఇందులో చూపించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.



ఇందులో చాందిని తమిళరసన్, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యర్ , సత్యకృష్ణ, వేణు, భూపాల్, టెంపర్ వంశీ  ఇతర పాత్రలు పోషించారు.  సాయి కార్తీక్  ఈసినిమాకి సంగీత దర్శకుడు.  ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ''బుజ్జీ.. ఇలారా'' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కమెడియన్, హీరో అని మాత్రమే ఆలోచించకుండా ఈ మధ్య విభిన్న పాత్రలు ఎంపిక చేసకుంటూ దూసుకుపోతున్నాడు సునీల్. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అల్లు అర్జున్-సుకుమార్ 'పుష్ప' లో కూడా విలన్ రోల్ అని చెబుతున్నారు. గరుడ వేగ మూవీ దర్శకుడు తెరకెక్కించిన సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఫస్ట్ లుక్, టీజర్ కూడా మంచి మార్కులే సంపాదించుకున్నాయి. మరి 'బుజ్జి ఇలా రా' మూవీ సునీల్ కి ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి...
Also Read: కోతి, అరటి పండు, వేటగాడు, చెట్టు…బిగ్ బాస్ హౌస్ లో వెరైటీగా ఏడోవారం నామినేషన్ల ప్రక్రియ...ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..
Also Read: దసరా తర్వాత సరిగ్గా 21 రోజులకు దీపావళి ఎందుకు వస్తుంది .. బండ్ల గణేష్ ట్వీట్ లో ఏముంది..వాస్తవం ఏంటి..!
Also Read:  ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండుగే...థియేటర్ల లోనూ సందడే సందడి
Also Read: నువ్వు ఇక్కడ లేకపోయినా భయం వేస్తోంది..సమంత పోస్ట్ వైరల్...
Also Read: 'స్వామీజీ'గా టర్న్ అవుతున్న 'అఘోరా' బాలయ్య, నందమూరి అభిమానులకు పూనకాలే...
Also Read: వాళ్ల రాజీనామాలు అందలేదు.. శ్రీవారి సన్నిధిలో మంచు విష్ణు సంచలన కామెంట్స్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి