Ram - Rapid Action Mission Telugu Movie: రామ్... అంటే 'ర్యాపిడ్ యాక్షన్ మిషన్'. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కుతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఓఎస్‌ఎం విజన్‌ సంస్థ రూపొందిస్తోంది. దీపికాంజలి వడ్లమాని నిర్మాత. మిహి రామ్ వైనతేయ దర్శకుడు. ఈ సినిమాలో సూర్య అయ్యల సోమయజుల హీరో. కథానాయకుడిగా ఆయనకు తొలి చిత్రమిది. ఆయన జోడీగా ధన్యా బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ జంట మీద తెరకెక్కించిన 'మనతోని కాదురా బై' గీతాన్ని శ్రీకాంత్ అడ్డాల విడుదల చేశారు.


ధనుంజయ్ స్వరం... విజయ్ నృత్యం
'రామ్ - ర్యాపిడ్ యాక్షన్ మిషన్' చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీత దర్శకుడు. ఆయన అందించిన బాణీకి రాము కుమార్ ఏఎస్‌కే సాహిత్యం అందించగా... యువ గాయకుడు ధనుంజయ్ ఆలపించారు. పోలాకి విజయ్ నృత్య దర్శకత్వం వహించారు. ఈ పాటను హైదరాబాద్ సిటీ రోడ్స్ మీద తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది.


Also Readలవర్‌కు హ్యాండ్ ఇస్తున్న 85 శాతం అమ్మాయిలు - రీసెంట్ రీసెర్చ్ గురించి 'బేబీ' హీరో విరాజ్ అశ్విన్ ఏమన్నారంటే?



దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ''వాస్తవ ఘటనలు, సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. మా హీరో సూర్య అయ్యల సోమయజుల తొలి చిత్రమిది. అయితే... సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు ఆ మాట అసలు తెలియదు. అనుభవం ఉన్న హీరోలా ఆయన నటించారు'' అని చెప్పారు. దర్శకుడు మిహి రామ్ వైనతేయకు సైతం ఇది తొలి సినిమా అని, దేశభక్తి కథతో ఆయన తీస్తున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని హీరో చెప్పారు.


Also Readకాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?



బ్రేవ్ హార్ట్స్... దేశభక్తి గీతం! 
'మనతోని కాదురా బై' పాటకు ముందు విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యంగా మన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సైనికులకు నివాళిగా రూపొందిన 'బ్రేవ్ హార్ట్స్' గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారని, ఆ పాట అందరినీ ఆకట్టుకుందని చెప్పారు. 


Also Read: ‘అర్జున్ రెడ్డి’ మూవీని బన్నీతో చేయాలనుకున్నా, అందుకే విజయ్‌తో తీశా: దర్శకుడు సందీప్ రెడ్డి వంగా


'ఈ మాతృభూమి మట్టిలో... 
 మీ నెత్తురెంత కలిసెనో!
మా ఊపిరి అయ్యే దారిలో 
మీ ఉసురులెన్ని మిగిలెనో!
నీ కళ్ళ ముందు రంగులే...
త్రివర్ణమయ్యి మారేనా!' అంటూ ఆ గీతం సాగింది. 


సూర్య అయ్యల సోమయజుల, ధన్యా బాలకృష్ణ హేవ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, 'శుభలేఖ' సుధాకర్, రవి వర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ధారణ్ సుక్రి, సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్, నిర్మాత:  దీపికాంజలి వడ్లమాని, కథ - స్క్రీన్‌ ప్లే - మాటలు - దర్శకత్వం: మిహి రామ్ వైనతేయ.