Brahmamudi Promo Today: కల్యాణ్‌, అనామికల పెళ్లి జరగడం.. అప్పు కల్యాణ్‌ను లవ్ చేసింది అని దుగ్గిరాల ఇంట్లో వాళ్లకి తెలియడంతో అందరూ కావ్యను నిందించి దూరం పెట్టడం వంటి కాన్సెప్ట్‌లతో ‘బ్రహ్మముడి’ సీరియల్ చాలా ఆసక్తికరంగా మారింది. రాముడు.. అమ్మాయిల వైపే చూడడు అనుకునే రాజ్‌ ఓ అమ్మాయితో చనువుగా ఉండడంతో సీరియల్ ఇంట్రస్టింగ్‌గా మారింది. తాజాగా ఈ సీరియల్ ప్రోమో వచ్చింది. ఇక ప్రోమోలో ఏముందంటే.. 


శ్వేత, రాజ్ ఆఫీస్‌లో లాయర్‌తో మాట్లాడుతారు. ‘‘శ్వేత మొత్తం చెప్పింది కదా ఎలా ప్రొసీడ్‌ అవుతాం’’ అని రాజ్ లాయర్‌ని అడుగుతాడు. మా కేసులో ఇద్దరికీ విడాకులు తీసుకోవడం ఇష్టమే అని రాజ్ అంటాడు. ఇక కావ్య ఆ మాటలు వింటుంది. ఇక లాయర్ చాలా కేసుల్లో డివోర్స్ తీసుకుంటామని  అన్న తర్వాత నో అంటారు. అలా మీరు ఏమైనా అని లాయర్ రాజ్‌ని అడిగితే రాజ్ అలాంటి ఉద్దేశం ఏం లేదని లాయర్‌కి  చెప్తాడు. ఇక శ్వేత మనం ఏం తప్పు చేయడం లేదు కదా అని రాజ్‌ను అడుగుతుంది. మన సమస్యకు ఇదే పరిష్కారం అని రాజ్ శ్వేతకు చెప్తాడు. ఆ మాటలు విన్న కావ్య షాక్ అయి చాలా బాధ పడుతుంది. ఇక రాజ్‌, శ్వేతను దగ్గరగా తీసుకొని బయటకు వస్తుంటాడు. ఆ సీన్ చూసి కావ్య అలా ఉండిపోతుంది. మరోవైపు రాజ్‌ కూడా కావ్యను చూసి షాకైపోతాడు. "



నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. 


అనామిక అందరి కోసం కాఫీ చేసుకొని వస్తుంది. అది బాగోలేకపోవడంతో అందరూ కష్టపడి తాగడానికి ప్రయత్నిస్తారు. ఇక కల్యాణ్ వచ్చి తాను కూడా కాఫీ తాగుతాడు. బాలేదు అని అనామికతో చెప్తాడు. అందరూ ఇబ్బంది పడుతూ తాగుతున్నారని అంటాడు. ఇక కావ్య మళ్లీ కాఫీ చేసి తీసుకొస్తా అని వెళ్తుంది. ఇక అనామిక బాధ పడితే రుద్రాణి నువ్వు పెద్దింటి పిల్లవి కదా నీకు ఇలాంటి పనులు రావు ఏం పర్లేదు అంటుంది. ఇక కావ్య, స్వప్నలు అయితే పేదోళ్లు అని అంటే స్వప్న ఫైర్ అవుతుంది. అందరి ముందు కోడల్ని తక్కువ చేయకూడదు అని తెలీదా అని తిడుతుంది. ఇక కావ్య మళ్లీ కాఫీ చేసుకొని అందరి కోసం తీసుకొస్తుంది. 


మరోవైపు రాజ్‌కు శ్వేత ఫోన్ చేస్తుంది. రాజ్ తన గదికి వెళ్లి మాట్లాడుతాడు. ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశావని అడుగుతాడు. ఇక కల్యాణ్ పెళ్లి తర్వాత లాయర్‌ని కలిసి విడాకుల గురించి మాట్లాడాలి అని చెప్పావని మర్చిపోయావా అని రాజ్‌ను శ్వేత అడుగుతుంది. దీంతో రాజ్ ఈ హడావుడిలో మర్చిపోయాను అని లాయర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నావా అని అడుగుతాడు. ఇక అపాయింట్‌మెంట్ ఎప్పుడో తీసుకున్నాను అని కానీ ఒకసారి ప్రోసీడ్‌ అయ్యాక వెనక్కి తీసుకోలేమని శ్వేత అంటుంది. దానికి రాజ్ ఆల్రెడీ అనుకున్నదే కదా ఇంక వెనక్కి తీసుకోవడం ఏం లేదని అంటాడు. ఇక లాయర్ 9 కలుస్తానన్నాడు అని శ్వేత చెప్పగానే లాయర్‌ని ఆఫీస్‌కు తీసుకొచ్చేమని రాజ్ చెప్తాడు. 


మరోవైపు కావ్య టీ తీసుకొని రూమ్‌కి వస్తుంది. టీ టిఫిన్ ఏమొద్దని రాజ్ ఇంపార్ట్ంట్ మీటింగ్ అని అంటాడు. దీంతో కావ్య టిఫిన్‌ తీసుకొని ఆఫీస్‌కు వెళ్లాలి అని అనుకుంటుంది. మరోవైపు అనామిక ఒంటరిగా బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి రుద్రాణి వచ్చి అనామికను తన దారిలోకి తెచ్చుకొని కావ్యను ఓ ఆట ఆడించొచ్చు అని అనుకుంటుంది. అనామికకు కాఫీ ఇస్తుంది. ఇక అనామికతో మంచిగా మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్లందరినీ తన గ్రిప్‌లో పెట్టుకోమని అనామికను అంటుంది. అందుకు ముందు కల్యాణ్‌ తన మాట వినేలా చేయమని అంటుంది. ఇక అనామిక తాను అమాయకురాలిని కాదని కావ్య బుద్ధి ఇంట్లో వాళ్లకి కల్యాణ్‌కి తెలిసేలా చేస్తాఅని అంటుంది. 


మరోవైపు రాజ్, శ్వేతలు ఆఫీసుకు బయలు దేరుతారు. మధ్యలో ఇద్దరూ కలిసి ఐస్‌క్రీం తింటుంటారు. ఇక టిఫిన్‌ తీసుకొని ఆఫీసుకు బయలుద్దేరిన కావ్య మధ్యలో వాళ్లని చూసి రాజ్‌కి ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. రాజ్ అబద్ధం చెప్తాడు. దీంతో కావ్య ఆ అమ్మాయి ఎవరూ అని అనుకుంటుంది. ఇక రాజ్, శ్వేతలు కావ్య వెళ్తోన్న ఆటో డ్రైవర్‌ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినందుకు గొడవ పెట్టుకుంటారు. 


మరోవైపు స్వప్న తన అత్త, భర్తలు తనని సరిగా చూసుకోవడం లేదు అని రచ్చ చేస్తుంది. తాను ఏ తప్పు చేయలేదు అని తేలితే మంచిగా చూసుకుంటా అని రుద్రాణి అన్న మాటలు గుర్తుచేస్తుంది. స్వప్న మాటల్లో నిజం ఉందని అందరూ అంగీకరిస్తారు. స్వప్నని మంచిగా చూసుకోమని చిట్టీ రుద్రాణికి చెప్తుంది.


‘అర్జున్ రెడ్డి’ హిట్ కాకపోతే సందీప్ ఆ పని చేసేవాడు - ‘యానిమల్’ నిర్మాత ప్రణయ్ వంగ