Naga Panchami Promo Today: ‘నాగపంచమి’ సీరియల్ నుంచి ప్రోమో వచ్చేసింది. ఫణేంద్ర పంచమితో మీ పక్కనే నేను ఉన్నాను కదా ఏం జరిగినా నేను చూసుకుంటాను అని అంటాడు. దీంతో పంచమి తన భర్తకు మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. మోక్ష సరే అనడంతో తర్వాత కింద కూర్చొని పాములా మారిపోతుంది. దీంతో మోక్ష పంచమి పామును చూసి భయపడతాడు. తర్వాత మోక్ష కూడా కింద కూర్చొని తన చేయిని చాచు తాడు. ఇక పంచమి పాము మోక్ష చేతిలోకి వెళ్లి చుట్టుకుంటుంది. అది చూసి మోక్ష చిరు నవ్వు నవ్వుతాడు.''
నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
ఇంట్లో వాళ్లందరికీ క్షమాపణలు చెప్పి మోక్షపంచమిని తమ గదికి తీసుకెళ్తాడు. ఇక వైదేహి పంచమిని ఏం చేయలేకపోయింది అని జ్వాల, చిత్రలు ఆమెను వెటకారం చేస్తారు. మరోవైపు పంచమి గదిలో తన అత్త అన్న మాటలు తలచుకుంటూ బాధపడుతుంటే మోక్ష వచ్చి నాకు అర్థమైంది పంచమి నువ్వు ఎంత భయపడ్డావో తెలుస్తుంది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. వాళ్ల మాటలు నిన్ను బాగా హర్ట్ చేసుంటాయి కదా అని అంటాడు. దానికి పంచమి నేను బాధ పడుతున్నది వాళ్ల మాటలకు కాదు మోక్షాబాబు. వాళ్లు ఏం అబద్ధం ఆడలేదు. నేను పాము అని నిజం చెప్పారు. నా గురించి తెలిసిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉండి మిమల్ని కాపాడుకోలేను అన్న భయం తప్ప నాకు ఎవరి మీద కోపం లేదని చెప్తుంది. ఒక భర్తగా నన్ను కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఎక్కువ కాలం నిజాన్ని దాచి ఉంచలేదని అంటుంది. దాంతో మోక్ష తాను ఉన్నంత వరకు ఈ ఇంట్లో నీకు ఏ హాని జరగనివ్వను అని చెప్పాడు.
ఇక పంచమి అది జరగని పని మోక్షాబాబు. నేను లేకుండా మీ ఇంట్లో మీ వారితో మీరు ఉండగలరు. కానీ మీరు లేకుండా నేను ఉండటం అనే ప్రశ్నే ఉండదని అంటుంది. దానికి మోక్ష చెప్పాను కదా పంచమి ఇక మన మధ్య ఇలాంటి ప్రశ్నలకు చోటు ఉండదు. ఉంటే ఇద్దరం కలిసి ఉంటాం. లేకపోతే ఇద్దరం ఉండమని అంటాడు. ఇక పంచమి మోక్షకు తన నిర్ణయం మార్చుకోమని కోరుతుంది. తన కోసం ఎవర్ని వదులుకోవాల్సిన అవసరం లేదని తానే ఏదో ఒకటి చేసి మిమల్ని కాపాడుతాను అని అంటుంది. మోక్ష మరోసారి ఇలా మాట్లాడకు పంచమి అని చెప్తాడు. ఇక పంచమి ఏం చెప్పితే అలా చేస్తా అని.. తాను ఫణేంద్రతో మాట్లాడుతా అని అందుకు ఏర్పాట్లు చేసుకుందామని.. ఇంకేం ఆలోచించకు పంచమి చెప్తాడు. ఇక తమ ఇంట్లో ఉండటం అసాధ్యమని.. ఆ ఇంట్లో ఉండటం ఇదే చివరి రోజని పంచమితో చెప్తాడు. తర్వాత పంచమి, మోక్ష, మోహిని, ఫణేంద్ర ఓ చోట కలుసుకుంటారు.
మోక్ష ఫణేంద్రతో మీరు మాట్లాడుకున్న విషయం నాకు పంచమి చెప్పింది. నేను దానికి ఒప్పుకుంటున్నాను. మీరేం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను అని అంటాడు. దానికి ఫణేంద్ర ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. నాగమణి చాలా శక్తివంతమైనది. ఇష్టరూప నాగు కాటుకి చనిపోయిన వారిని ఆ నాగమణితో బతికించొచ్చు అని అంటాడు. ఇక మోక్ష తనకు ఆ వివరాలతో పనిలేదని.. పంచమి చెప్పింది తాను ఒప్పుకున్నానని.. నేను అన్నింటికి సిద్ధపడే ఉన్నానని అంటాడు. ఇక ఫణేంద్ర మనసులో మోక్ష ఇష్టరూప నాగజాతికి శత్రువు.. మహారాణి చావుకు కారణమైన వాడిని బతికించాల్సిన అవసరం తనకు లేదని అనుకుంటాడు. ఇక పంచమి ఆలోచిస్తున్నావేంటి ఫణేంద్ర.. ఇంకా ఏదైనా అనుమానమా.. మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది కదా.. నేను నీ మీద పూర్తి విశ్వాసంతో నా భర్త ప్రాణాలను పణంగా పెడుతున్నానని చెప్తుంది. దాంతో ఫణేంద్ర అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. మీరు స్థానం, సమయం నిర్ణయిస్తే మిగిలిన కథంతా నేను నడిపిస్తానని అంటాడు.
ఇక ఫణేంద్ర నాగలోకాని వెళ్లి అందుకు నాగదేవత అంగీకారం తీసుకోవాలి అని.. ఆ తల్లి అనుమతిస్తే కానీ నువ్వు పాముగా మారి కాటేయలేవు. అదీకాక నీకు ఇష్టరూప నాగుల శక్తులు వస్తే గానీ నిన్ను నేను నిన్ను నాగలోకం తీసుకెళ్లలేను. ఇక నాగమణి సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు. ఇక ఫణేంద్ర నాగలోకం వెళ్లి నాగదేవతతో యువరాణి తనతో రావడానికి ఒప్పుకుందని చెప్తాడు. ఇష్టరూప శక్తులు పంచమికి ప్రసాదించమని కోరుతాడు. యువరాణికి ఇష్టరూప నాగుల శక్తులు ప్రసాదిస్తే తాను పాముగా మారి ఈ రాత్రికే మోక్షను చంపే కార్యక్రమం పూర్తి చేయించుకొని తనతో పాటు యువరాణిని తీసుకొచ్చేస్తా అని చెప్తాడు. నాగదేవత యువరాజా నీమీద నమ్మకంతో నేను యువరాణికి శక్తుల ప్రసాదిస్తాను. ఇందులో ఎలాంటి పొరపాటు జరిగినా నువ్వే పూర్తి బాధ్యత వహించాలి. అందుకు నువ్వు అంగీకరించాలి. మననాగలోక శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి అన్న సంగతి నీకు తెలుసుకదా.. క్షమాపణలకు ఇక్కడ చోటు ఉండదు అని చెప్పి ఫణేంద్ర ఒప్పుకున్న తర్వాత పంచమికి శక్తులు ప్రసాదిస్తుంది.
Also Read: విమాన ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, తన ఇద్దరు కూతుళ్లు దుర్మరణం