Guppedanta Manasu  Serial Today Episode: రిషిని తీసుకొచ్చినట్లు వసుధార తండ్రి చక్రపాణికి తెలుస్తుంది. చక్రపాణి వసుధార దగ్గరకు వచ్చి ఎలా బతికేవారు ఇలా అయ్యారు. అంతా ఆస్తి ఉండి.. కనీసం సరిగ్గా తినలేని పరిస్థితి. అల్లుడు గారు ఏమైనా మందులు వేసుకున్నారా అని  అడుగుతాడు. అక్కడి ఊరి వాళ్లు ఏదో  పసరు మందు తాగించారట ఇక ఎలాంటి మందులు వాడలేదు అని వసుధార, చక్రపాణికి చెప్తుంది.


చక్రపాణి:  అల్లుడు గారు చాలా బాధలో ఉన్నారు. అలా ఊరికే వదిలేయలేం. హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. జగతి మేడమ్ కాలం చేశారు. ఇంతకీ మేడమ్ కేసు సంగతి ఏమైంది. ఎవరు చేశారో ఏమైనా తెలిసిందా?


వసుధార: అదంతా చేసింది శైలేంద్రనే


 అని వసుధార చెబుతుంది. దాంతో చక్రపాణి షాక్ అవుతాడు.


చక్రపాణి: శైలేంద్రపై నాకు ఎప్పటి నుంచో అనుమానంగా ఉండేది. ఇప్పుడు ఆధారాలు దొరికేతే చాలు.


వసుధార:  అలా ఆధారాలు వెతికే క్రమంలోనే రిషి సార్‌కు ఇలా అయింది. సార్‌కు నిజం తెలియదు గానీ, శైలేంద్ర మీద డౌట్ వచ్చింది. నిజం తెలిసాకా ఆయనే శిక్షిస్తారు.


 అని వసుధార అంటుంది. రిషి సార్‌కు అమ్మంటే చాలా ప్రాణం. ఆమెను అలా చేసినవాళ్లను కచ్చితంగా వదిలిపెట్టరు అని చక్రపాణి అంటారు. మరోవైపు అనుపమతో జగతి చనిపోవడం గురించి.. రిషి, వసుధారల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు మహేంద్ర. ఇంతలో మహేంద్రకు వసుధార కాల్ చేస్తుంది. హ్యాపీగా కాల్‌ లిప్ట్‌ చేసిన


మహేంద్ర: ఎక్కడికి వెళ్లావ్ అమ్మా. నీకోసం ఎంతగా వెతికించానో తెలుసా


 అని మహేంద్ర అంటుంటే.. డాడ్ నేను రిషి అంటాడు. దాంతో సంతోషంతో ఆశ్చర్యపోతాడు మహేంద్ర.  నాన్న రిషి.. ఎలా ఉన్నావ్. ఇది వసుధార ఫోన్ కదా అని అడుగుతాడు మహేంద్ర. బాగున్నాను డాడ్. నేను వసుధార కలిసే ఉన్నాం అని రిషి చెబుతాడు. నీకోసం ఎంతో గాలించాం. ముకుల్ సహాయం కూడా తీసుకున్నాను అని మహేంద్ర అంటాడు. ఇంతకీ ఎక్కడున్నావ్ అని మహేంద్ర అడిగితే.. చక్రపాణి మావయ్య ఇంట్లో ఉన్నాం అంటాడు. అయితే తాము  వస్తున్నామని మహేంద్ర చెబితే.. ఎవరికీ చెప్పకుండా రండి అని రిషి చెప్తాడు. రిషి దగ్గరికి వచ్చిన  మహేంద్ర ఎంతో ఆరాటంగా ఫీలవుతూ..


మహేంద్ర:  ఏంటీ నాన్న ఈ దెబ్బలు. ఎలా జరిగింది. ఎలా ఉన్నావు నాన్న


వసుధార: రిషి సార్ సరిగా నిలబడలేకపోతున్నారు. ఎక్కువగా కూర్చోలేకపోతున్నారు.


 అని వసుధార చెబుతుంది. బ్యాక్ బోన్ కు దెబ్బ తగిలినట్లు ఉందని రిషి అంటాడు. రిషి సార్‌పై అటాక్ జరిగినప్పుడు లోయలో పడిపోయారట. అప్పుడే దెబ్బ తగిలినట్లు ఉందని వసుధార అంటుంది. అయితే  స్పైనల్ సర్జన్‌ దగ్గరికి వెళ్దాం ఇలా టైమ్ వేస్ట్ చేయడం ఎందుకు అని అనుపమ అంటుంది. నేను ఎక్కడికి రాలేను. ఓపిక లేదు అని రిషి అంటాడు. అదేంటీ నాన్నా అంతలా ఇబ్బందిపడుతున్నావ్ అని.. రిషి గురించి ముందే నాకు చెప్పొచ్చు కదమ్మ అంటాడు  మహేంద్ర.  


వసుధార: మేము ఇందాకే వచ్చాం మావయ్య


మహేంద్ర: అమ్మా వసుధార అసలు ఏమైంది, రిషి గురించి నీకు ఎలా తెలిసింది.


వసుధార: నేను కాలేజీలో ఉన్నప్పుడు రిషి సార్ నుంచి కాల్ వచ్చింది. తర్వాత వెళ్లి కలిస్తే రౌడీలు వెంటపడ్డారు. వాళ్లను కొట్టి సార్‌ను కలిశాను. అప్పుడు మళ్లీ ఆ రౌడీలు వచ్చారు. అప్పుడు రిషి సార్ ముకుల్‌కు కాల్ చేస్తే వచ్చి కాపాడారు.


 అని జరిగిదంతా చెబుతుంది వసుధార 


మహేంద్ర: ఇంత జరుగుతుంటే మాకు చెప్పాలనిపించలేదా


వసుధార:  నా కంటే నేను రిషి సార్ గురించే ఎక్కువ ఆలోచిస్తాను. ఆ సమయంలో నేను ఇంకేం ఆలోచించలేదు.


 అని వసుధార చెప్పగానే.. సరే మన ఇంటికి వెళ్దాం అని మహేంద్ర అంటే.. మావయ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో రిషి సార్‌ ఇక్కడే ఉండటం మంచిది. చెప్పాను కదా చాలా అటాక్స్ జరిగాయని అని వసుధార అంటుంది.


మహేంద్ర: వాడు అటాక్స్ చేస్తుంటే మనం చూస్తూ కూర్చుంటామా. ఈసారి రానీ ఒక్కొక్కరిని షూట్ చేసి పడేస్తాను.


 అని మహేంద్ర కోపంతో రగిలిపోతాడు.


అనుపమ: మహేంద్ర.. ఇప్పుడు ఆవేషపడే సమయం కాదు. రిషి గురించి ఆలోచించాల్సిన సమయం. రిషికి కూడా బాలేదు. వసుధార చెప్పింది నిజమే. ఇక్కడ ఉండటమే సేఫ్


అని అనుపమ కన్విన్స్ చేస్తుంది. దాంతో సరేనని మహేంద్ర అంటాడు. తర్వాత రిషికి బ్రెడ్ తీసుకొస్తుంది వసుధార. నువ్వు కూడా సరిగా తినలేదు కదా అని రిషి అంటాడు. సరే అని రిషికి ముందు బ్రెడ్ తినిపిస్తుంది వసుధార. ఇంతలో మహేంద్ర కూడా యాపిల్స్ కట్ చేసి తీసుకొస్తాడు. ఇద్దరిని యాపిల్స్‌ తినమని చెప్పి మొత్తానికి నీ ఊపిరి నువ్వే పోసుకున్నావ్. రిషిని కాపాడుకున్నావ్. సరే యాపిల్స్ తినేసి పడుకోండి అని చెప్పి మహేంద్ర వెళ్లిపోతాడు. రిషికి వసుధార బ్రెడ్, యాపిల్స్ తినిపిస్తుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: కాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?