Gruhalakshmi Serial Today Episode:  డైనింగ్‌ టేబుల్‌ దగ్గర పరంధామయ్య తులసిని తిడుతుంటాడు. నంద, తులసిని తిట్టొద్దని చెబితే నువ్వేవడు నాకు చెప్పడానికి నేను ఈ ఫ్యామిలికి హెడ్‌ను నువ్వు నాకు చెప్పొద్దు అంటూ నందాకు కూడా వార్నింగ్‌ ఇస్తాడు పరంధామయ్య. ఇంతలో లాస్య వచ్చి ఏమైంది మామయ్య అని అడుగుతే  వీడు హద్దు మీరి మాట్లాడతున్నాడు. తులసిని వెనకేసుకొస్తున్నాడు అని చెప్తాడు. దీంతో లాస్య.. తులసి చాలా మంచిది మామయ్య అనడంతో తను మంచిదని నువ్వు చెప్పడం కాదు. ముందు నీ భర్తను నువ్వు కంట్రోల్‌లో పెట్టుకో అంటాడు. పరంధామయ్య. తులసి ఏడుస్తూ బయటకు వెళ్లబోతూ కిందపడబోతుంటే నంద పట్టుకుంటాడు. జాగ్రత్త తులసి అనడంతో కోపంగా..

పరంధామయ్య: జాగ్రత్తగా ఉండాల్సింది తను కాదురా నువ్వు. తను నీ దగ్గరకు వచ్చి కావాలనే పడింది.

అనసూయ: కావాలనే ఎందుకు పడుతుందండి.

పరంధామయ్య: నీ కొడుకును పడేయడానికే

అనసూయ: అర్థం లేకుండా మాట్లాడకండి.

పరంధామయ్య: నీకు అర్థం కాకపోతే నోరు మూసుకుని కూర్చో.. నీ కొడుకు కోడలును చూసి ఈర్ష పడుతుంది.

   అంటూ తులసిని తిట్టి..నువ్వే దగ్గరుండి నాకు వడ్డించు అంటూ లాస్యకు చెప్తాడు పరంధామయ్య. దీంతో తులసి బాధపడుతుంది. మరోవైపు విక్రమ్‌ వాళ్ల ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. నేను ఎంత గౌరవంగా ఉందామనుకున్నా మీరు పరువు తీస్తున్నారు. అంటూ రాజ్యలక్ష్మీ విక్రమ్‌, దివ్యలకు క్లాస్‌ తీసుకుంటుంది. అలా రోడ్ల మీద పరుగెత్తడం ఏంటి ఎందుకు పరుగెత్తింది చెప్పు విక్రమ్‌ అంటూ రాజ్యలక్ష్మీ అడుగుతుంది. తనకు తెలియదని విక్రమ్‌ చెప్తాడు. కేవలం దివ్య కోసమే బొమ్మ వేయించానని అసలు ఆ విషయం గురించి పట్టించుకోవద్దని విక్రమ్‌ చెప్పి వెళ్లిపోతాడు. నువ్వు సీరియస్‌గా తీసుకోవద్దన్నా నేను ఊరుకుంటానా? అని మనసులో అనుకుంటుంది రాజ్యలక్ష్మీ. తర్వాత విక్రమ్‌ ఒంటరిగా కూర్చుని ఇంట్లో వాళ్లు అందరూ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తుంటాడు. ఇంతలో వాళ్ల నాన్న వచ్చి తప్పు చేసిన వాళ్లే తల దించుకుంటారు. అంటూ దివ్య ఏడుస్తుంటే నువ్విలా ఇక్కడ కూర్చోవడం బాగాలేదని తనను అలా వదిలేయడం పద్దతి కాదంటాడు.

విక్రమ్‌: వదిలేయలేదు నాన్నా.. దగ్గరకు వెళితే దివ్య వేసే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆయోమయంలో నిలబడ్డాను.

ప్రకాశం: నువ్వు కాకపోతే ఇంకెవరు సమాధానం చెప్తారురా? దివ్య పరిస్థితి నీకు క్లియర్‌గా చెప్పాను. ఏం  చేయాలో కూడా చెప్పాను.

విక్రమ్‌: మీరు చెప్పినట్లే చేస్తున్నాను నాన్నా.. యాక్సిడెంట్‌ అయిన అమ్మాయి బొమ్మ గీయించి వెతికే ప్రయత్నం చేస్తున్నాను. పోలీసుల దగ్గరకు కూడా వెళ్లాం. అసలు అలాంటి మనిషే లేదంటున్నారు.

ప్రకాశం: అంటే అక్కడితో వెతకడం ఆపేశావా?  

  అంటూ ప్రకాశం ప్రశ్నించడంతో విక్రమ్‌ లేదని కానీ కొన్నిసార్లు దివ్యను చూస్తుంటే అమ్మవాళ్లు అనుమానించడం నిజమే అనిపిస్తుంది. అనడంతో దివ్య ఇంకా నిన్ను నమ్మలేదు కాబట్టి నిజం చెప్పడం లేదని ప్రకాశం చెప్పడంతో విక్రమ్‌ కన్వీన్స్‌ అవుతాడు. తన ప్రయత్నం ఆపనని యాక్సిడెంట్‌ అయిన అమ్మాయి దొరికే వరకు వెతుకుతానని విక్రమ్‌ చెప్తాడు. మరోవైపు తులసి ఒంటరిగా కూర్చుని పరంధామయ్య అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంతలో నంద వస్తాడు. తులసి వెళ్లిపోతుంటే..

నంద: ఎందుకు అవైడ్‌ చేస్తున్నావు. నాతో మాట్లాడే అర్హత కూడా నాకు లేదా?

తులసి: అర్హత కాదు. అవకాశం లేదు. ఎందుకో కారణం ఇంతకు ముందే చెప్పాను. నీకర్థం కాకపోతే నేనేం చేయను.

నంద: లాస్య తెగించి అడుగులు వేస్తుంది. మనందరి జీవితాలు తన చేతుల్లోకి వెల్లిపోయాయి. ప్రతిరోజు నాన్నతో నువ్వు మాటలు పడుతున్నావు. కోపం రావటం లేదా?

  అనగానే పరిస్థితి తారుమారు అయితే లాస్య అన్ని దులుపేసుకుని వెళ్లిపోతుంది. కానీ తర్వాత బాధపడేది మనం. అందుకే తప్పనిసరై లాస్య ముందు తల వంచాను. అంటూ తులసి, నంద మాట్లాడుకుంటుండగా లాస్య వచ్చి చూస్తుంది.  కోపంగా పరంధామయ్య దగ్గరకు వెళ్లి తులసి, నంద మాట్లాడుకుంటున్నారని చెప్పి ఆయనను తీసుకుని వస్తుంది. కానీ అక్కడ తులసి, నంద కనిపించరు. వాళ్లిద్దరూ బెడ్‌రూంలో కనిపించకుండా దాక్కుని ఉంటారు.

లాస్య మొత్తం వెతికి కిందకు వెళ్లిపోతుంది. చూశారా లాస్య మన మీద ఎంత పగతో ఉందో అందుకే నాకు దూరంగా ఉండమని చెప్పాను అంటుంది తులసి. దీంతో నంద అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు బసవయ్య తాను చాలా హ్యాపీగా ఉన్నట్లు దివ్యకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చావు. ఈ దెబ్బకు నిజంగానే దివ్యకు పిచ్చెక్కుతుందని రాజ్యలక్ష్మీతో చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

Also Read: అమ్మాయిని అలా టచ్ చేస్తావా? ధనుష్ మూవీ ఈవెంట్‌లో ఆకతాయిని చితకబాదిన యాంకర్