క్కువ జనాలు పాల్గొనే ఈవెంట్లలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించవచ్చు అని ఆలోచించే మగవారు కూడా ఉంటారు. ఆ రద్దీలో వారితో అసభ్యకరంగా ప్రవర్తించి వెంటనే తప్పించుకోవచ్చని అనుకుంటారు. చాలా సందర్భాల్లో అదే జరిగింది కూడా. కానీ కొన్నిసార్లు మాత్రమే అలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడిని వదలకుండా.. బుద్ధి చెప్పాలనుకునే అమ్మాయిలు ఉంటారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఒక తమిళ యాంకర్ కూడా యాడ్ అయ్యింది. ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన యాంకర్ ఐశ్వర్య రఘపతిని ఓ వ్యక్తి అసభ్యకరంగా టచ్ చేశాడు. దానికి ఐశ్వర్య రియాక్ట్ అయిన పద్ధతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కాలర్ పట్టుకొని కొట్టింది..
ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మేకర్స్ అంతా కలిసి చెన్నైలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. దానికి హోస్ట్‌గా ఐశ్వర్య రఘుపతి వ్యవహరించింది. అయితే ఆ ఈవెంట్ ప్రారంభం అయిన తర్వాత ఆ గుంపులో ఒక వ్యక్తి వచ్చి తనను అసభ్యకరంగా టచ్ చేశారు. టచ్ చేసిన వెంటనే పారిపోవాలని చూశాడు. కానీ ఐశ్వర్య తనను వదలలేదు. కాలర్ పట్టుకుంది. అలా ఎలా టచ్ చేస్తావంటూ చెంపలు వాయించింది. ఈ ఘర్షణ అంతా అక్కడ ఉన్నవారు రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఐశ్వర్య తెగింపు చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ విషయంపై ఐశ్వర్య కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రియాక్ట్ అయ్యింది.






మృగాల మధ్య బ్రతకాలంటే భయమేస్తోంది..
‘‘ఆ గుంపులో ఒక వ్యక్తి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నేను వెంటనే తనవైపు తిరిగి తనను కొట్టేవరకు వదిలిపెట్టలేదు. తను పరిగెత్తాడు. నేనూ తన వెనకాలే పరిగెత్తాను. నా పట్టును వదలాలని అనుకోలేదు. ఒక అమ్మాయి శరీర భాగాలను ఇష్టం వచ్చినట్టు తాకొచ్చు అనుకున్న అతడి ధైర్యం నాకు నచ్చలేదు. తనపై అరిచాను. అటాక్ చేశాను. నా చుట్టూ చాలామంది మంచివారు ఉన్నారు. ప్రపంచంలో కూడా గౌరవంగా బ్రతికే మనుషులు ఉన్నారని కూడా నాకు తెలుసు. కానీ ఇలాంటి కొంతమంది మృగాల మధ్య బ్రతకాలి అనే ఆలోచనే నన్ను భయపెడుతుంది’’ అంటూ ఐశ్వర్య రఘుపతి.. ఈవెంట్‌లో జరిగిన ఘటన గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది.


స్పందించని ‘కెప్టెన్ మిల్లర్’ టీమ్..
ఐశ్వర్య రఘుపతి.. ఆ వ్యక్తిపై అంత సీరియస్‌గా రియాక్ట్ అయినా.. ‘కెప్టెన్ మిల్లర్’ టీమ్ మాత్రం ఈ ఘటన గురించి స్పందించడానికి ముందుకు రాలేదు. సాఫీగా సాగుతుంది అనుకున్న ఈవెంట్‌లో ఇలా జరగడం నచ్చలేదని మేకర్స్ ఫీల్ అవుతున్నట్టు సమాచారం. దీంతో లోకల్ పోలీసుల వరకు కూడా ఈ సమాచారం ఇంకా వెళ్లలేదు. ఇక ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’లో తాను మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించనున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్‌కు జోడీగా ప్రియాంక మోహన్ నటించింది. తెలుగులో ఇప్పటికే పలు భారీ సినిమాలు విడుదల అవుతున్నా కూడా వాటికి పోటీగా జనవరి 12న ‘కెప్టెన్ మిల్లర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: అమ్మకు హిందీ రాదు, నాకు తెలుగు రాదు - ‘దేవర’ సెట్‌లో నన్ను ‘టేప్ రికార్డ్’ అని ఆటపట్టిస్తున్నారు: జాన్వీ కపూ