Reema Sen's family pic goes viral on internet: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన బ్యూటీ రీమా సేన్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, బెంగాలీతో పాటు బాలీవుడ్ లోనూ పలు హిట్ సినిమాల్లో నటించింది. 2000లో డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ‘చిత్రం‘ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన 'మిన్నెలే' చిత్రంతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఆమె చేసిన ‘మనసంతా నువ్వే‘ చిత్రం తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇందులో ఉదయ్ కిరణ్ సరసన రీమా హీరోయిన్ గా నటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తమిళంలో విజయ్ ‘భగవతి‘, విశాల్ ‘చెల్లమే‘ లాంటి చిత్రాలతో మంచి పాపులారిటీ తెచ్చుకోవడంతో పాటు అగ్రతారగా ఎదిగింది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం
నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గడంతో రీమా సేన్ వ్యక్తిగత జీవితం మీద ఫోకస్ పెట్టింది. 2012లో వ్యాపారవేత్త శివ కరణ్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరం అయ్యింది. తన సమయాన్ని అంతా ఫ్యామిలీకే కేటాయించింది. వీరికి 2013లో బాబు జన్మించాడు. అతడికి రుద్రవీర్ అనే పేరు పెట్టారు. నిజానికి రీమా సేన్ ఇండస్ట్రీకి దూరం అయ్యాక ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫ్యామిలీ పిక్ బాగా వైరల్ అయ్యింది. రీమా సేన్ కొడుకు అప్పుడే చాలా పెద్దవాడు అయ్యాడు. అంతే కాదు రీమా సేన్‌కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
రీఎంట్రీకి రెడీ అవుతున్న రీమా సేన్!
రీమా సేన్ 1981 అక్టోబర్ 29న కోల్ కత్తాలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు సినిమాలు అంటే చాలా ఇష్టం. నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అనుకునేది. నటన మీద ఇంట్రెస్ట్ తో మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. పలు యాడ్స్ లో నటించింది. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన రీమా సేన్ మళ్లీ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. నటనా ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె, రీఎంట్రీ ద్వారా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి. ప్రస్తుతం రీమా సేన్ ఫ్యామిలీతో కలిసి ముంబైలో నివాసం ఉంటుంది.
Read Also: ‘అర్జున్ రెడ్డి’ హిట్ కాకపోతే సందీప్ ఆ పని చేసేవాడు - ‘యానిమల్’ నిర్మాత ప్రణయ్ వంగ