Guntur Kaaram Meme Fest On Meenakshi’s Poster: సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో విడుదల అవుతున్న పెద్ద సినిమాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానులలో భారీగా అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ అందుకుంటుందని ఆశిస్తున్నారు.


మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్


మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ రిలీజ్‌కి దగ్గర పడుతోంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. లంగా వోణీలో క్యూట్‌‌గా ఉన్న మీనాక్షి మహేష్ బాబు భుజాలపై చేతులు వేసుకుని నిలబడి ఉంది. ఈ సినిమాలో ఆమె రాజీ పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.  


మీనాక్షి చౌదరి పోస్టర్ మీద బోలెడు మీమ్స్


ఇప్పటికే ‘గుంటూరు కారం‘ సినిమాకు సంబంధించి ‘కుర్చి మడతపెట్టి‘ పాట మదిరిగానే, మీనాక్షి పోస్టర్ మీద జోరుగా మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. మహేష్ బాబు స్థానంలో ఇతర హీరోలు, కమెడియన్లు, విలన్లను పెట్టి మీమర్స్ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. ‘ఛత్రపతి‘ చిత్రంలోని కాట్రాజు, బ్రహ్మీ, త్రివిక్రమ్‌, విజయ్ దేవరకొండ భుజాల మీద మీనాక్షి చేతులు వేసినట్లుగా మార్ప్ చేసిన పోస్టర్లు నెటిజనులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మీనాక్షి చౌదరికి గత చిత్రాలు ‘HIT 2‘, ‘ఖిలాడి‘తో పోల్చితే ఈ సినిమాతో మాంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇక ఆమె తాజా పోస్టర్ మీద వస్తున్న మీమ్స్ కూడా మంచి క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. 














త్రివిక్రమ్ సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ కామన్!


దర్శకుడు త్రివిక్రమ్ తన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు తీసుకోవడం కామన్ అయ్యింది. ‘అ ఆ’ మూవీలో రెండో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోగా, ‘అరవింద సమేతలో’ ఈషా రెబ్బాను తీసుకున్నారు. ఇక ‘అత్తారింటికి దారేది’ మూవీలో రెండో హీరోయిన్ గా ప్రణీత నటించింది. ‘గుంటూరుకారం’ చిత్రంలో మీనాక్షిని రెండో హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే, ఈ సినిమా ద్వారా ఆమెకు ఏమేర గుర్తింపు వస్తుందనేది చూడాలి.


సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల


మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు, వెన్నెల కిషోర్ ఈశ్వరీ రావ్, రఘుబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read Also: ‘అర్జున్ రెడ్డి’ హిట్ కాకపోతే సందీప్ ఆ పని చేసేవాడు - ‘యానిమల్’ నిర్మాత ప్రణయ్ వంగ