TDP Responds on Ambati Rayudu Resigned to Ysrcp: వైసీపీని వీడుతున్నట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. కాగా, పార్టీలో చేరిన 10 రోజులకే ఈ నిర్ణయం ప్రకటించడంపై టీడీపీ స్పందించింది. 'జగన్ వంటి దుర్మార్గుడితో కలిసి మీరు మీ రాజకీయ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉంది. మీ భవిష్యత్ ప్రయత్నాల్లో మీకు అంతా మంచే జరగాలని దేవుడిని కోరుకుంటున్నాం' అంటూ సంచలన ట్వీట్ చేసింది. దీనికి అంబటి రాయుడు ట్వీట్ ను ట్యాగ్ చేసింది.






ఇదీ జరిగింది


మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి షాక్ ఇచ్చారు. పార్టీలో చేరిన వారం రోజులకే వైసీపీని వీడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'నేను వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నా. రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉండాలనుకుంటున్నా. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా' అంటూ ట్వీట్ చేశారు. దీంతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అంటూ పార్టీ శ్రేణులు, అభిమానుల్లో ఉత్కంఠ రేగింది.






ఇదే కారణమా.?


గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైసీపీలో చేరారు. అయితే, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు స్థానానికి మారాల్సిందిగా సీఎం జగన్ శుక్రవారం ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి ఏమాత్రం అంగీకరించని శ్రీకృష్ణదేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాయుడుకి మచిలీపట్నం టికెట్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గుంటూరు టికెట్ ఆశించిన రాయుడు, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది.


Also Read: Ambati Rayudu: 'క్రికెట్ అలా.. పాలిటిక్స్ ఇలా' - గుంటూరు 'మిర్చి' అంబటి రాయుడు వ్యవహార శైలి వివాదమేనా!