'బేబీ' సినిమాతో విజయం అందుకున్న యువ హీరో విరాజ్ అశ్విన్ (Viraj Ashwin). ఆయన నటించిన తాజా సినిమా 'శ్రీరంగనీతులు'. విరాజ్ సరసన 'చిలసౌ', 'హిట్' సినిమాల ఫేమ్ రుహానీ శర్మ నటిస్తున్నారు. యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు వైవిధ్యమైన పాత్రలతో మంచి గుర్తింపు, విజయాలు అందుకున్న సుహాస్... 'కేరాఫ్ కంచరపాలెం', 'నారప్ప' సినిమాల ఫేమ్ కార్తీక్ రత్నం ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లేటెస్టుగా సినిమా టీజర్ విడుదల చేశారు. 


ప్రేమికుడికి హ్యాండ్ ఇస్తున్న అమ్మాయిలు
ముగ్గురు యువకుల కథగా 'శ్రీరంగనీతులు' సినిమా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. అందులో విరాజ్ అశ్విన్ కథకు వస్తే... అతను రుహానీ శర్మతో ప్రేమలో ఉంటాడు. ఆ అమ్మాయి ఏమో సంపన్నురాలు. 'నేను అడిగితే తన పేరు చెప్పలేదు. వాళ్ళ నాన్న అడిగితే నీ పేరు చెబుతుందా?' అని హీరోని వాసు ఇంటూరి ప్రశ్నిస్తాడు. 'నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. నేను నా ఫ్యామిలీతో డీల్ చేయాలి. మా నాన్నను తలుచుకుంటే నాకు భయం వేస్తుంది' అని హీరోతో హీరోయిన్ చెబుతుంది. వీళ్ళ ప్రేమ కథ ఏ తీరాలకు చేరిందనేది సినిమాలో చూడాలి.


Also Readకాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?


'ఈ మధ్యే ఒక రీసెర్చ్ లో తెలిసింది. 85 పర్సెంట్ మంది అమ్మాయిలు వాళ్ళు లవ్ చేసిన విషయం ఇంట్లో కూడా చెప్పకుండా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారట' అని విరాజ్ అశ్విన్ చెప్పిన డైలాగ్ మాత్రం వైరల్ అవుతోంది.


బాగుపడాలా? నీకు నచ్చినట్టు ఉండాలా?
కార్తీక్ రత్నం విషయానికి వస్తే... అతనిది మరో కథ. మందు, సిగరెట్, గాంజా... ఒక విధమైన జీవితంలో ఉన్నాడు. కార్తీక్ రత్నం తండ్రి పాత్రలో దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్ నటించారు. 'నీ ప్రాబ్లమ్ ఏంటి?' అని తండ్రి అడిగితే 'నువ్వు బాగుపడాలని'' అని సమాధానం వస్తుంది. 'బాగుపడాలా? నీకు నచ్చినట్టు ఉండాలా?'' అని హీరో ప్రశ్నిస్తాడు.


Also Readఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే



సుహాస్ విషయానికి వస్తే.. ఊరంతా తన ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టించడం అతని అలవాటు. 'ఎందుకురా మీకు ఇవన్నీ?' అని పెద్దలు చెబితే... 'మన గురించి ఎలా తెలుస్తుంది అందరికీ' అని స్నేహితులతో చెప్పే టైపు. మూడు కథలు ఒక్కటి అయ్యాయా? లేదా? అనేది సినిమాలో చూడాలి. 


'శ్రీ‌రంగనీతులు' చిత్రానికి ప్ర‌వీణ్‌ కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. ఈ చిత్రాన్ని రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో విడుదల తేదీ వెల్లడించనున్నారు. 



'శ్రీరంగనీతులు' ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ''ఈత‌రం యువ‌త, వారి ఆలోచ‌న‌లతో పాటు ఎమోష‌న్స్‌ ఏ విధంగా ఉంటున్నాయి? అనేది సినిమాలో మూడు పాత్రల ద్వారా చూపిస్తున్నాం. యువత జీవితంలోని కీలకమైన దశలను ఆస‌క్తిక‌ర‌మైన కథ‌, కథ‌నాల‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వేలో చూపించే ప్ర‌య‌త్నం చేశాం'' అని అన్నారు. ''మోడ్రన్ సెన్సిబిలిటీస్‌తో అంద‌రికి న‌చ్చే విధంగా దర్శకుడు ప్రవీణ్ కుమార్ వి.ఎస్.ఎస్ చిత్రాన్ని తెర‌కెక్కించార‌''ని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: టీజో టామీ, సంగీతం: హ‌ర్షవ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌ & అజ‌య్ అర‌సాడ‌, కూర్పు: శ‌శాంక్ ఉప్ప‌టూరి.