ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే ఆయన ఈరోజు 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

ఆయన భౌతికకాయాన్ని రేపు ఉదయం 5 గంటలకు కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు వైద్యులు. ఆ తరువాత హైదరాబాద్‌ లో మణికొండ ప్రాంతంలో ఉన్న పంచవటిలోని స్వగృహానికి శివశంకర్ మాస్టర్  భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని స్వగృగంలోనే కాసేపు ఉంచి నివాళులు అర్పించనున్నారు. 


రేపు మధ్యాహ్నం 2 గంటలకు మహాప్రస్థానంలో అత్యక్రియలు నిర్వహించనున్నారు. చనిపోయే ముందు శివశంకర్‌ మాస్టర్‌కు కోవిడ్ నెగెటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యులు వెల్లడించారు. ఆయన పెద్ద కుమారుడు విజయ్‌ శివశంకర్‌ ప్రస్తుతం కోవిడ్ తో పోరాడుతున్నారు.


 

తెలుగు, తమిళం వంటి దక్షిణాది సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ అందించారు. తెలుగులో రాజమౌళి, రామ్ చరణ్ 'మగధీర' సినిమాలోని 'ధీర ధీర' పాటకు శి‌వశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ దక్కింది. 'బాహుబలి' చిత్రానికి కూడా శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. టెలివిజన్ రంగంలో 'ఆట జూనియర్స్', 'ఢీ' వంటి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి యువ డాన్సర్లకు విలువైన సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన మృతి నృత్య కళా రంగానికి తీరని లోటు. 

 


 


 


 

Also Read: ఆపవేరా? ఆదుకోరా? లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా? - దేవుడికి ప్రశ్నలు సంధించిన పాట







ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి