ABP  WhatsApp

Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై ప్రస్తుత వ్యాక్సిన్లు పనిచేయవా? నిపుణులు ఏమంటున్నారు?

ABP Desam Updated at: 28 Nov 2021 08:15 PM (IST)
Edited By: Murali Krishna

కరోనా కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయా? అనేది ప్రస్తుతం పెద్ద సందేహం. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారు.

ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు పనిచేస్తాయా?

NEXT PREV

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వైరస్‌పై భారత్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌పై ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేయలేవని చాలామంది నిపుణులు చెబుతున్నామాట. అయితే ఈ విషయంపై ఎయిమ్స్ చీఫ్ డా. రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.



కొత్త వేరియంట్​​ స్పైక్ ప్రోటీన్​లో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయి. ఈ స్పైక్​ ప్రోటీన్లే రోగి కణాల్లోకి చొచ్చుకెళ్లి, వైరస్​ వ్యాప్తికి కారణమవుతాయి. స్పైక్​ ప్రోటీన్​ శక్తిని తగ్గించేందుకు చాలా టీకాలు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. స్పైక్​ ప్రోటీన్లలో మ్యుటేషన్లు పెరిగిపోతే టీకాల సామర్థ్యం తగ్గిపోతుంది. స్పైక్ ప్రోటీన్ల ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యం వైరస్​కు లభిస్తుంది.                                        - డా. రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ చీఫ్


ఆందోళన అవసరమా?


ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు వైరస్‌పై సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కానీ కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి. ఒమిక్రాన్​పై ప్రస్తుత వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని గులేరియా స్పష్టం చేశారు.


వైరస్​ వ్యాప్తి, రోగనిరోధక శక్తిపై కొత్త వేరియంట్​ పోరాడే తీరుపైనే భవిష్యత్​ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని గులేరియా అన్నారు. ప్రస్తుతానికి ఒమిక్రాన్​ వేరియంట్​ను భారత్​లో గుర్తించలేదని, ఐఎన్​ఎస్​ఏసీఓజీ తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ ప్రయాణికులు, ముఖ్యంగా కొవిడ్​ కేసులు అనూహ్యంగా పెరిగిన దేశాల నుంచి వచ్చే ప్రజలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


Also Read: Omicron Scare: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. విమాన సేవల పునరుద్ధరణపై కేంద్రం సమీక్ష


Also Read: International News: 'ఆవు.. మహిళ.. ఓ భర్త..' ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ట్విస్ట్ అదిరింది!


Also Read: Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం కీలక సూచనలు.. సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ


Also Read: Covid New Variant: 'దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'


Also Read: Mann Ki Baat: నాకు పవర్‌ కాదు.. ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ


Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్


Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?


Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?


Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 28 Nov 2021 08:12 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.