రష్మీ గౌత‌మ్‌కు గ్లామరస్ ఇమేజ్ ఉంది. 'ఎక్స్ట్రా జబర్దస్త్' షో చేయడానికి ముందే ఆమె సినిమాల్లో నటించారు. యాంక‌ర్‌గా పేరు వచ్చిన తర్వాత కూడా సినిమాలు చేశారు. ముఖ్యంగా 'గుంటూరు టాకీస్' సినిమాల్లోని పాటల్లో రష్మీ గౌతమ్ గ్లామర్ షో గురించి ఇప్పటికీ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఆ సినిమా తర్వాత ఆమె చాలా సినిమాలు చేసినప్పటికీ... వాటిలో గ్లామర్ సాంగ్స్ ఉన్నప్పటికీ... ఎందుకో 'గుంటూరు టాకీస్'లో సాంగ్ 'నీ సొంతం' ఫేమస్ అయ్యింది. బహుశా... ఆ పాటను 'ఊ అంటావా... ఊఊ అంటావా' సాంగ్ బీట్ చేస్తుందేమో చూడాలి.


'పుష్ప: ద రైజ్'లో సమంత స్పెషల్ సాంగ్ చేశారు. 'ఊ అంటావా... ఊఊ అంటావా' పాటలో అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్స్ వేశారు. ఇప్పుడీ పాటకు రష్మీ గౌతమ్ కూడా స్టెప్స్ వేశారు. సంక్రాంతి సందర్భంగా ఈటీవీ కోసం మల్లెమాల సంస్థ ఓ స్పెషల్ ఈవెంట్ చేసింది. 'అమ్మమ్మ గారి ఊరు' పేరుతో చేసిన ఆ కార్యక్రమంలో రష్మీ గౌతమ్ 'ఊ అంటావా...' పాటకు స్పెషల్ పెర్ఫార్మన్స్ చేశారు. అది చూసిన హీరోయిన్ కృతీ శెట్టి 'వావ్' అన్నట్టు ఓ ఎక్స్‌ప్రెష‌న్‌ ఇస్తే... 'రష్మీ చేస్తే ఎవరైనా ఊ అనాల్సిందే' అని 'హైపర్' ఆది అన్నారు.
Also Read: రావాలి సుధీర్... కావాలి రష్మీ!
యూట్యూబ్ ప్రోమో కింద 'రష్మీ సార్ రష్మీ అంతే' అని ఒకరు కామెంట్ చేస్తే... 'రష్మీ బంగారం అదిరిపోతుంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు. రష్మీ సెగలు పుట్టిస్తుందని చెప్పడానికి సంకేతంగా ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేశారు. ప్రోమోలో కూడా రష్మీ పెర్ఫార్మన్స్ వచ్చినప్పుడు ఫైర్ రావడం విశేషం. ఈ ఈవెంట్‌లో సుధీర్ కూడా ఉండి ఉంటే బావుండేద‌ని కొంద‌రు అభిప్రాయపడ్డారు. రష్మీతో సుధీర్ డాన్స్ చేసి ఉంటే అదిరిపోయేదని కామెంట్ చేశారు.
Ammamma Gari Ooru Promo 04 - Sankranthi Special Event 2022:


Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: 'ఆచార్య' రిలీజ్ డేట్ మీద కన్నేసిన రాజ'శేఖర్'...
Also Read: థియేటర్స్ సమస్యపై ఆంధ్ర మంత్రులతో మాట్లాడతా, ఏపీ తరహాలో ఆ సౌకర్యం ఇక్కడా అమలు..: తలసాని
Also Read: సిద్ధార్థ్‌తో మాట్లాడ‌లేదు! కానీ, అతను క్షమాపణలు కోరడం సంతోషమే! - సైనా నెహ్వాల్
Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..
Also Read: విడాకుల తర్వాత మాంచి జోష్‌లో చైతూ.. పెళ్లి వద్దంటూ పాట!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి