తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది. గురువారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజులు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి అనేది సంస్కృత పదం. దీన్నే భోగం అని కూడా అంటారు. భోగమంటే సుఖసంపదలు. ఇది కాలక్రమేనా భోగిగా మారింది. సూర్యుడు దక్షిణాయన సమయంలో భూమికి దూరంగా జరగడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీనివల్ల చలి తీవ్రత పెరుగుతుంది. అందుకే.. అంతా ఆ రోజు చలిమంటలు వేస్తుంటారు. పాత వస్తువులను అగ్ని దేవుడికి ఆహుతి ఇచ్చి.. ఉత్తరాయణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటారు. మనలో చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటలు వెనుక ఉన్న ఆంతర్యం. సంక్రాంతికి స్వాగతం పలుకుతూ.. బంధుమిత్రులకు భోగి శుభాకాంక్షలు చెప్పేద్దామా.
☀ కొత్త అల్లుళ్లకు స్వాగతం పలికే తోరణాలు..
ధాన్యపు రాసులతో నిండిన గోదాములు..
ముంగిట్లో అందమైన రంగలవల్లులు
చెడును దహించే భోగి మంటలు.
భోగాలను అందించే భోగి పండ్లు..
ఘుమఘుమలాడే పిండి వంటలు..
కీర్తనలు పాడే హరిదాసులు..
సంక్రాంతికి తెచ్చేను సందళ్లు..
సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ ఇళ్లు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు
☀ ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలను అందించాలి.
మీ కష్టాలన్నీ దహించి వేయాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.
☀ భోగ భాగ్యాల భోగి..
సరదాల సంక్రాంతి..
కమ్మనైన కనుమ..
మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి.
అందరికీ భోగి శుభాకాంక్షలు.
☀ ఈ భోగి మీకు సకల భాగ్యాలను అందించాలని ఆ దేవుడిని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు భోగి శుభాకాంక్షలు.
☀ మీలోని చెడును, దురలవాట్లను,
చెడు సావాసాలను భోగి మంటల్లో వేసేయండి.
జీవితంలోకి కొత్త వెలుగులను ఆహ్వానించండి.
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు!
☀ ఈ భోగి భోగభాగ్యాలతోపాటు..
మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ..
అందరికీ భోగి శుభాకాంక్షలు.
☀ భోగి మంటల వెచ్చని వెలుగులు..
రంగవల్లుల్లో గొబ్బిళ్లు..
కొత్త బియ్యపు పొంగళ్లు..
అందరి మది ఆనందంతో పరవళ్లు..
పెద్ద పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు
☀ ముంగిళ్లలో మెరిసే రంగవల్లులు..
తెలుగుదనానికి తలమానికంగా నిలిచే ప్రతి ఇల్లు..
కుటుంబాలను దగ్గరకి చేర్చే మూడు రోజులు..
మీ జీవితాల్లో మరిన్ని మధురానుభూతులు నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు.
☀ భాగ్యాలనిచ్చే భోగి..
సరదాలనిచ్చే సంక్రాంతి..
కమ్మదనం పంచే కనుమ..
ఈ సంబరం నింపాలి మీ ఇంట్లో సిరుల పంట..
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు!
☀ నింగిని తాకే పతంగులు..
పలనాడులో కోళ్ల పందేలు..
చిందులువు వేసే బసవన్నలు..
సంక్రాంతి మూడు దినాలు..
చూడతరమా పల్లె అందాల సోయగాలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
☀ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే.. మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని.. రవికిరణం
భోగభాగ్యాల భోగి.. సంతోషాల సంక్రాంతి..
సుఖసంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు!
☀ భోగి మంటల వెచ్చదనం..
పిండివంటల కమ్మదనం..
వాకిట్లో రంగవల్లుల సౌందర్యం..
పల్లె పల్లెకు తెచ్చెను అందం..
మీకు.. మీ కుటుంబ సభ్యులకు..
భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
☀ ఈ భోగి మీ చీడ-పీడలను తొలగించాలని..
మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని..
భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆశిస్తూ..
అందరికీ.. భోగి పండగ శుభాకాంక్షలు!
Also Read: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి