Unstoppable With NBK : ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అదిరిపోయే రికార్డ్, బాలకృష్ణ ఎక్కడా తగ్గట్లేదుగా..

బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షో తిరుగులేని ఆదరణ సంపాదించుకుంటోంది. నటసింహంలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటున్న వారంతా వహ్వా అనకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ షో.

Continues below advertisement

సినిమాలు, రాజకీయాలతో బిజిగా ఉన్న బాలకృష్ణ... క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటూ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ అదుర్స్ అనిపించుకున్నారు. బాలయ్య టాక్ షో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్న వారంతా షాక్ అయ్యేలా షో కంటిన్యూ చేస్తున్నారు నందమూరి నటసింహం. ఏదో నడుస్తోంది అనుకుంటే పొరపాటే..ఎందుకంటే ఈ టాక్ షో హిట్ కాదు సూపర్ హిట్ అయింది. ఈ షో హక్కుల కోసం పలు టీవీ చానెల్స్ పోటీపడుతున్నాయని టాక్. ఈ షో కోసం బాలయ్య చేస్తున్న హోం వర్క్ అంతా ఇంతా కాదు. కొత్తతరంతో కలసి పనిచేస్తూ ఇప్పటి వరకూ చూడని బాలయ్యని పరిచయం చేశారు. 

Continues below advertisement

ఇప్పటికే అఖండ సూపర్ హిట్ తో 2021 కి బైబై చెప్పిన బాలకృష్ణ అదే సమయంలో టాక్ షోతో అంతకుమించి అనిపించుకున్నారు. ఇప్పటికే 7 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ తాజాగా రవితేజ, గోపిచంద్ మలినేని ఇంటర్వ్యూతో మరో మజిలీ పూర్తి చేసుకుంది. తన టైమింగ్ తో నవ్వులు పూయించడమే కాదు వాళ్లను ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యారు. పైగా ప్రతి ఎపిసోడ్ లోనూ   హ్యూమన్ యాంగిల్ స్టోరీని ప్రసారం చేస్తూ ఎపిసోడ్ కి మరింత మెరుగులు అద్దుతున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే..  బాలయ్య హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షో IMDB (ఇండియన్ మూవీ డేటా బేస్‌)లో చోటు సంపాదించుకుంది. ఈ షో టాప్ 10 రియాలిటీ టీవీలో లిస్టులో చేరినట్టు ప్రకటించింది. IMDB 9.4/10 రేటింగ్‌తో దూసుకుపోతుంది. మొత్తంగా బాలయ్య ‘ఆహా’ ఓటీటీ వేదికతో నిజంగా హోస్ట్‌గా ప్రేక్షకులతో ఆహా అనిపిస్తున్నారు. ప్రస్తుతం అఖండ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న బాలకృష్ణ... సంక్రాంతి తర్వాత గోపీచంద్ మలినేని తో ప్రాజెక్ట్ ను పట్టాలపైకి తీసుకెళ్లనున్నారు. 

Also Read:  దీపా నీ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోందంటూ డాక్టర్ బాబు ఆవేదన.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
Also Read: వసుధార కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… అయోమయంలో జగతి-మహేంద్ర… గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
Also Read:  షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..

Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.
Continues below advertisement