మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఈసారి 'జబర్దస్త్' షో నుంచి ఇద్దరు పేరున్న ఆర్టిస్ట్ లు పోటీ చేశారు. అందులో ఒకరు యాంకర్ అనసూయ కాగా, మరొకరు సుడిగాలి సుధీర్. వీరిద్దరూ కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా పోటీ చేశారు. నాగబాబు తన సపోర్ట్ ని ప్రకాష్ రాజ్ కి ఇవ్వడంతో అనసూయ, సుధీర్ కూడా అదే ప్యానెల్ లో జాయిన్ అయ్యారు. వీరందరిదీ 'జబర్దస్త్' రిలేషన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

 


 

అయితే నిన్న ప్రకటించిన ఫలితాల్లో ముందుగా అనసూయ భారీ మెజారిటీతో గెలిచిందని అన్నారు. మరోపక్క సుడిగాలి సుధీర్ ఓడిపోయాడంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను వైరల్ చేశారు. తీరా చూస్తే.. ఈ ఫలితాలు తారుమారయ్యాయి. భారీ మెజారీటీతో గెలిచిందని చెప్పిన అనసూయ పేరు గెలిచిన లిస్ట్ లో లేదు. కానీ సుడిగాలి సుధీర్ మాత్రం ఈసీ మెంబర్ గా గెలవడం విశేషం. 

 

ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి మొత్తం ఎనిమిది మంది ఈసీ మెంబర్లుగా గెలవగా.. అందులో సుడిగాలి సుధీర్ ఒకరు. మొత్తానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో సుడిగాలి సుధీర్ కి చోటు దక్కింది. బుల్లితెరపై ఈయన ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస షోలను హోస్ట్ చేస్తూ.. 'జబర్దస్త్'లో స్కిట్ లు చేస్తూ తీరిక లేకుండా గడుపుతుంటాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రలో రెండు, మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

 



Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..


Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు! 


Also Read: ‘మా’ మంచు విష్ణు విజయంపై సెలబ్రెటీల ట్వీట్స్.. అప్పుడు మాట్లాడలేదు.. ఇప్పుడు..


Also Read: అక్టోబరు 10 మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిందా..అప్పుడు మోహన్ బాబు ఇప్పుడు మంచు విష్ణు..హిస్టరీ రిపీట్


Also Read: ‘మా’ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ రాంగ్ ఛాయిస్? చిరు - మోహన్ బాబు విభేదాలే రచ్చకు కారణమయ్యాయా?


Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి