'బాహుబలి' సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తోన్న ప్రభాస్.. దాంతో పాటు 'సలార్', 'ఆదిపురుష్' సినిమాలను లైన్లో పెట్టాడు. వీటితో పాటు నాగశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె'లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవన్నీ ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి. ఇవి పూర్తికాకుండానే తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశారు ప్రభాస్.
Also Read:‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ to ‘గనీ’.. అన్నీ ahaలోనే అట.. థియేటర్లో విడుదలకు ముందే..
'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి 'స్పిరిట్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కరీనా కపూర్ ఖాన్ ను ఎంపిక చేసుకున్నట్లు టాక్. 'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ తో కలిసి కరీనా కపూర్ భర్త సైఫ్ నటించారు. ఇప్పుడు ఏకంగా కరీనా.. ప్రభాస్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ హీరోయిన్లు ఉండగా.. కరీనా కపూర్ కి ఈ అవకాశం ఇవ్వాలనుకోవడం విశేషమనే చెప్పాలి.
ఇదిలా ఉండగా.. మరోపక్క ఈ సినిమా కోసం ప్రభాస్ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడని అంటున్నారు. 'రాధేశ్యామ్' సినిమా తరువాత నుంచి ప్రభాస్ ఒక్కో సినిమాకి రూ.100 కోట్లు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక తన కెరీర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ప్రభాస్ 25 సినిమా 'స్పిరిట్' కోసం ఆయన రూ.150 కోట్లు డిమాండ్ చేశారని సమాచారం. ప్రభాస్ అడిగినంత మొత్తాన్ని నిర్మాతలు ఇవ్వడానికి రెడీ అవ్వడంతో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి ప్రభాస్ రెడీ అయ్యారు. ఈ సినిమా కథను ముందుగా రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కి వినిపించగా.. వాళ్లు రిజెక్ట్ చేశారని టాక్.
Also Read: ఓటీటీలో తాప్సీ, విక్కీ కౌశల్ సినిమాలు.. మిస్ కాకండి..
Also Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్ల
Also Read: ‘బిగ్ బాస్’లో తల్లీకూతుళ్ల వార్.. తొక్కలో రిలేషన్‌షిప్ వద్దంటూ ఆనీ కన్నీళ్లు
Also Read: ‘పంచతంత్రం’ టీజర్.. ముసలి తాబేలు చెప్పే మన కథలు.. బ్రహ్మీ ఈజ్ బ్యాక్!
Also Read: ‘పుష్ప’ నుంచి సెకండ్ సింగిల్ శ్రీవల్లి ఫుల్ సాంగ్ ఇదిగో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి