అల్లు అర్జున్-రష్మిక-సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న పుష్ప సినిమాకు సంబంధించి శ్రీవల్లి సాంగ్  ప్రోమో నిన్న  విడుదల చేసిన మేకర్స్ ఈ రోజు ఫుల్ సాంగ్ వదిలారు.  ‘చూపే బంగారమాయెనే..మాటే మాణిక్య మాయెనే  శ్రీవల్లి’ అంటూ సాగే సాంగ్ కూల్ గా ఉంది. ఇప్పటికే విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్, టీజర్,  'దాక్కో దాక్కో మేక' సాంగ్ అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. ముందుగా విడుదల చేసిన శ్రీవల్లి సాంగ్ ప్రోమో అదుర్స్ అనిపించగా ఇప్పుడు ఫుల్ సాంగ్ అభిమానులను ఫిదా చేస్తోంది. ‘దాక్కో దాక్కో మేక’ రీసెంట్ గా  80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా విడుదల చేసిన  ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి’ అంటూ సాగిన సాంగ్ ప్రోమోకి మంచి స్పందన వస్తోంది.  తెలుగు తమిళం మలయాళం కన్నడ లోనూ   సిద్ శ్రీరామ్ పాడటం విశేషం. హిందీలో మాత్రం జావేద్ అలీ ఆలపించాడు. తెలుగు పాటకు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు.


అల్లు అర్జున్ ట్వీట్:






‘పుష్ప: ది రైజ్-పార్ట్ 1’లో మలయాళ నటుడు ఫాహాద్ విలన్ గా నటిస్తున్నాడు.  శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా బన్నీ.. గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపించనుంది.  దేవిశ్రీ ప్రసాద్  ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘పుష్ప ది రైజ్’ 2021 డిసెంబర్ 17 న గ్రాండ్ రిలీజ్ కానుంది. 


‘పుష్ఫ’ శ్రీవల్లి సాంగ్‌ను ఇక్కడ చూడండి:



Also Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్ల
Also Read: సిరి-కాజల్ పై యానీ మాస్టర్ ఫైర్.. డ్రామా క్వీన్ అంటూ కామెంట్స్..
Also Read: రెండు వర్గాలుగా ఇక టాలీవుడ్ ! "మంచు"కు మందుంది అసలు పరీక్ష !
Also Read: ‘అవేంజర్స్’ను మించిన ‘ఇటర్నల్స్’.. థానోస్‌ను ఎందుకు ఆపలేకపోయారు?
Also Read: శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఎందుకంత ప్రత్యేకం, దశమి రోజు ఈ శ్లోకం రాసి జమ్మిచెట్టుకి కడితే…


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి