మోనాల్ గజ్జర్.. గతేడాది మొత్తం  ఆమె గురించే డిస్కషన్. ఎప్పుడో అల్లరి నరేశ్ నటించిన 'సుడిగాడు'తో హీరోయిన్‌గా పరిచయమైన మోనాల్ అడపా దడపా సినిమాల్లో నటించినా పెద్దగా క్రేజ్ రాలేదు. వన్ బై టు, ఒక కాలేజ్ స్టోరి, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి లాంటి సినిమాలు చేసిన మోనాల్ కి బ్రేక్ ఇచ్చే అవకాశం ఒక్కటీ రాలేదు. మధ్యలో ఒకటి రెండు హిందీ, తమిళ సినిమాలు చేసిన  అక్కడ కూడా పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకోలేకపోయింది. తెలుగు, హిందీ, తమిళం ఏ ఇండస్ట్రీలోనూ సక్సెస్ అందుకోపోవడంతో ప్రేక్షకులు కూడా దాదాపు ఆమెను మరిచిపోయారు. అలాంటి  సమయంలో బిగ్ బాస్ హౌస్ లో మెరిసి గ్లామర్ తో ఆకట్టుకుంది. లేటెస్ట్ విషయం ఏంటంటే తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు చెప్పుకొచ్చింది. 





ఈ మేరకు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ గుజరాతీ భామ.





ఇక కెరీర్ విషయానికొస్తే ఇతర భాషల్లో ఆఫర్లు దక్కించుకోలేకపోయినా తన మాతృబాష గుజరాతిలో మాత్రం క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తోంది. ఆ సినిమాల వల్లే బిగ్ బాస్ సీజన్ 4లో అవకాశం దక్కించుకుంది. షో ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఫేమస్ అయిందామె. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. ఇలా గేమ్ పరంగా కన్టేనా లవ్ ట్రాకుల కారణంగానే  మరింత క్రేజ్ అందుకుంది.బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. కొన్ని సినిమాలు, షోలు చేస్తూ బిజీగా ఉంది. మోనాల్ కి ఇన్టా గ్రామ్ లో 939K ఫాలోవర్స్ ఉన్నారు. 
Also Read: భార్య వేలు కట్ చేసి పారిపోయిన భర్త.. వెతుకుతున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు
Also Read: శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఎందుకంత ప్రత్యేకం, దశమి రోజు ఈ శ్లోకం రాసి జమ్మిచెట్టుకి కడితే…
Also Read: నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ రంగు వస్త్రం సమర్పించాలి...ఏ ప్రసాదం నివేదించాలి
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి