హైదరాబాద్‌లోని మలక్ పేట్‌లో ఓ వ్యక్తి నానా రభస చేశాడు. అతని ప్రవర్తనతో అక్కడ ఉన్న స్థానికులంతా ఆశ్చపోయారు. మద్యం మత్తులో సదరు వ్యక్తి ప్రవర్తించిన తీరు పలువురిని ఆందోళనకు సైతం గురి చేసింది. అతను అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియక కొందరు తలలు పట్టుకున్నారు. చివరికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు అతణ్ని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మత్తులో అరుస్తూ హల్ చల్ చేశాడు.


Also Read: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్... ప్రభుత్వానికి నివేదిక అందించిన త్రిసభ్య కమిటీ...


మలక్ పేట్‌లో మత్తు ఉండడం వల్ల ఓ యువకుడు కరెంట్‌ స్తంభం ఎక్కి హల్‌చల్‌ చేశాడు. విజయవాడ వెళ్లే నేషనల్ హైవేపై దిల్‌సుఖ్‌నగర్‌‌లోని సీఎంఆర్‌ షోరూమ్‌ ఎదురుగా ఈ ఘటన జరిగింది. మలక్‌పేట పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. సలీం నగర్‌ ఆఫ్జల్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌ అనే 28 ఏళ్ల వ్యక్తిపై గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. ఇతను పాతనేరస్తుడు. జైలులో శిక్ష కూడా అనుభవించాడు. మలక్‌పేట పీఎస్‌ పరిధిలో 2016లో దొంగతనం చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. ఇలా ఉండగా, సోమవారం ఉదయం తనను గుర్తు తెలియని వ్యక్తు కొట్టారంటూ హంగామా చేశాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన బ్లేడుతో చేతులు కోసుకుని, కర్రతో తల పగులగొట్టుకున్నాడు. టీ కప్పు పెంకులు నోట్లో వేసుకొని కరకరా నమలడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. తనను ఎందుకు కొట్టారని.. తానేం తప్పు చేశానని వీరంగం చేశాడు.


Also Read: తెలుగు అకాడమీ ఉద్యోగులు - బ్యాంక్ స్టాఫ్ కలిసి చేసిన దోపిడి ! ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతుపై కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు


అంతేకాక, తొలుత లోకల్‌ బస్టాండ్‌పైకి ఎక్కాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వచ్చేలోపే ఇర్ఫాన్‌ బస్టాండ్‌ పక్కనే ఉన్న కరెంట్‌ స్తంభం ఎక్కి ఇలా బీభత్సం చేశాడు. అక్కడి నుంచి దూకేస్తానని అరిచాడు. పోలీసులు వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. అతడికి ఏదో నచ్చ చెప్పి కరెంటు స్తంభం మీది నుంచి కిందికి దింపారు. వెంటనే అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అతని మానస్థిక స్థితి సరిగా లేదని గ్రహించిన పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి ఆసుపత్రికి తరలించారు.


Also Read:  తెలుగు అకాడమీ స్కామ్‌ కేసులో రంగంలోకి ఈడీ.. సీసీఎస్ విచారణలో షాకింగ్ విషయాలు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి