మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు.  అయితే  ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో దీనిపై విష్ణు ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్. మరి  కొత్త కమిటీ  ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుంది... ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల కోరిక మేరకు మొత్తం మంచు విష్ణు ప్యానెల్ సభ్యులే ప్రమాణ స్వీకారం చేస్తారా అన్నది చూడాలి. 


పంతం పట్టి "మా" ఎన్నికల్లో విజయం సాధించిన మోహన్ బాబు ఫ్యామిలీకి టాలీవుడ్‌లోని ఓ బలమైన వర్గం నుంచి మద్దతు లభించదని తేలిపోయింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారందరూ రాజీనామా చేయడమే కాదు...  మంచు విష్ణుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకే నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అంటే మా సహకారం ఇక ఉండదు.. మీరు చేయాల్సింది మీరు చేయండి అని చెప్పడమేనని అనుకోవచ్చు. ఇదంతా వ్యూహాత్మకంగానే జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సందర్బంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటించలేదు. కానీ మంచు విష్ణు మాత్రం భారీ హామీలు ఇచ్చారు.  మంచు విష్ణు ఇచ్చిన హామీలను రెండేళ్లలో అమలు చేయాల్సి ఉంటుంది. సొంత ఖర్చులో మా బిల్డింగ్ కట్టిస్తామని విష్ణు ప్రకటించారు. దాని కోసం కొన్ని కోట్లను విష్ణు ఖర్చు పెట్టాల్సి ఉంటుది. అనేక సంక్షేమ పథకాలను కూడా విష్ణు ప్రకటించారు.


విష్ణు ప్యానెల్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలివే
⦿ కొంతమంది నటీ నటులకు అవకాశాలు లేవు. వారికి సినిమాల్లో అవకాశాలు కల్పిస్తాం. 
⦿ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ప్రత్యేక యాప్ ఏర్పాటు చేస్తాం. ఐఎంబీబీ స్థాయిలో యాప్ తయారు చేస్తాం. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, రైటర్స్ తదితరులకు యాక్సెస్ ఇస్తాం. 
⦿ జాబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. అన్ని ప్రొడక్షన్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వద్దకు వెళ్లి.. ఒప్పందం చేసుకుంటాం. 
⦿ ‘మా’ కుటుంబం కోసం ఒక భవనం కట్టుకుంటాం. ఈ భవనం నా సొంత డబ్బుతో నేను కడతాను. మూడు స్థలాలు చూశాను. వాటిని ‘మా’ కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని, ఒక స్థలంలో భవనం కడతాం. భవిష్యత్తును ఆలోచించే ఇప్పుడు భవనాన్ని కడతాం. 
⦿ నా టెర్మ్‌లో నూరు శాతం ప్రారంభిస్తాం. అన్నీ అనుకూలంగా ఉంటే రెండేళ్లలో పూర్తి చేస్తాం. మా ఫ్యామిలీ డబ్బుతోనే పూర్తి చేస్తాం. 
⦿ అర్హులపై ‘మా’ సభ్యులకు ప్రభుత్వంతో మాట్లాడి సొంత ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నా. 
⦿ ఉచిత వైద్య అందిస్తాం. ఇప్పుడు ఉన్న స్కీమ్‌లో మా సగం పెట్టాలి, మిగతాది సభ్యుడు భరించాలి. కానీ, ఇకపై సభ్యుడికి వైద్యం ఉచితం. వారి కుటుంబ సభ్యులకు కూడా అవకాశం ఉంటుంది. ఈ మేరకు కార్పొరేట్ హాస్పిటల్‌తో ఒప్పందం చేసుకున్నాం. రెండు రాష్ట్రాల హాస్పిటళ్లలో మాట్లాడాం.
⦿ ప్రతి 3 నెలలకు ఒకసారి పెద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఈఎస్ఐ, హెల్త్ కార్డు ప్రతి సభ్యుడికి వచ్చేలా చేస్తాం. 
⦿ మీ తీసుకొచ్చే లైఫ్ ఇన్సురెన్స్ రూ.3 లక్షలు కంటే ఎక్కువ ఉండబోతుంది. 
⦿ అర్హులైన సభ్యుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు.. వారికి కావల్సిన చదువులకు సహకారం అందిస్తాం. స్కాలర్‌షిప్ కోసం యూనివర్శిటీలతో మాట్లాడుతున్నాం.
⦿ ‘కళ్యాణ లక్ష్మి’ కింద అర్హులైన సభ్యుల పెళ్లి ఖర్చుల కోసం 1.16 లక్షలు ‘మా’ తరఫున అందిస్తాం. ‘మా’ ప్యానల్ నుంచి ఒకరు ఆ పెళ్లికి హాజరవుతారు.
⦿ ‘మా’ చరిత్రలో తొలిసారిగా మహిళల రక్షణ కోసం హైపవర్ ఉమెన్ గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాం. 24x7 వారికి అందుబాటులో ఉంటాం.
⦿ ‘మా’ చరిత్రలో తొలిసారిగా మహిళల రక్షణ కోసం హైపవర్ ఉమెన్ గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాం. 24x7 వారికి అందుబాటులో ఉంటాం.
⦿ వృద్ధకళాకారుల సంక్షేమం కోసం ఎన్‌జీవో సర్వే చేయించి అర్హులకు పింఛను అందిస్తాం. ఎన్‌బీఎఫ్‌సీలో ఆర్టిస్టులకు సహాయం చేయడానికి ఫండ్ ఉంది. మా ఫ్యామిలీ తరపున కోర్డినేట్ చేసి ఇప్పిస్తాం. 
⦿ కొందరు సభ్యత్వం ఇచ్చాం. కానీ, ఓటు హక్కు ఇవ్వలేదు. మేం అధికారంలోకి రాగానే వారికి ఓటు హక్కు ఇస్తాం.
⦿ కరోనా వల్ల కళాకారులం ఇబ్బందిపడుతున్నాం. ఈ నేపథ్యంలో ‘మా’లో సభ్యులుగా చేరనున్న కొత్త కళాకారుల కోసం సభ్యత్వ రుసుమును రూ.1 లక్ష నుంచి రూ.75 వేలకు తగ్గిస్తాం. 
⦿ ‘మా’ ఉత్సవాలు నిర్వహించి ఫండ్ సేకరిస్తాం. వాటిని మంచి పనులకు ఉపయోగిస్తాం. 
⦿ కేంద్ర రాష్ట్ర పథకాలు చాలా ఉన్నాయి. వాటికి మేమంతా అర్హులం. వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చాలామందికి తెలీదు. మా ప్యానల్ బాధ్యత తీసుకుని అందరికీ అందేలా ప్రయత్నిస్తాం.
⦿ జూన్‌లో ‘మోహన్ బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’ ప్రారంభిస్తాం. ఇందులో ‘మా’ సభ్యులకు 50 శాతం స్కాలర్‌షిప్ ఇస్తాం. ఇప్పటికే ఉన్న ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లతో కూడా స్కాలర్‌షిప్ ఏర్పాటు చేస్తాం. 
⦿ మేం గెలిచిన వెంటనే ఇద్దరు ముఖ్యమంత్రులు, సినిమాటోగ్రాఫర్ మంత్రులను కలిసి నటులుగా మాకు ఏ సమస్యలు ఉన్నాయో చెప్పుకుంటాం. వారి సపోర్ట్ మేం కోరుకుంటాం. వారు మాకు హెల్ప్ చేస్తారనే నమ్మకం ఉంది. నేను, నా ప్యానల్ పూర్తిగా గెలిస్తేనే ఇవన్నీ చేయగలను. 


Also Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్ల
Also Read: సిరి-కాజల్ పై యానీ మాస్టర్ ఫైర్.. డ్రామా క్వీన్ అంటూ కామెంట్స్..
Also Read: రెండు వర్గాలుగా ఇక టాలీవుడ్ ! "మంచు"కు మందుంది అసలు పరీక్ష !
Also Read: ‘పుష్ప’ నుంచి సెకండ్ సింగిల్ శ్రీవల్లి ఫుల్ సాంగ్ ఇదిగో..
Also Read: పవన్ కల్యాణ్‌ విమర్శలకు మోహన్ బాబు ఆన్సర్ ఎప్పుడు? మాటలతోనా? చేతలతోనా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి