హాస్య నటుడు బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’ చిత్రం టీజర్ విడుదలైంది. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష పులిపాక రచన, దర్శకత్వం అందించారు. ఇందులో బ్రహ్మానంద కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన చెప్పే ‘పంచతంత్రం’ కథలే ఈ చిత్రం. 


పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్వాతిరెడ్డి భర్తతో ఇండోనేషియాలో సెటిలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ‘పంచతంత్రం’ సినిమాతో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. కొత్తగా పెళ్లై సాధారణ మధ్య తరగతి కుటుంబంలోకి అడుగుపెట్టిన దేవి పాత్రలో దివ్య కనిపించనుంది. సినిమాల్లో అన్ని క్యారెక్టర్లను అందంగా, ఆసక్తికరంగా రాసుకున్నామన్న దర్శకుడు అన్నిటి కంటే దేవి పాత్ర చాలా ప్రత్యేకం అన్నాడు. సదాసీదాగా, అమాయకంగా కనిపించే దేవి ఇంటికి, తనకు కష్టం వచ్చినప్పుడు కుటుంబం కోసం పోరాడే విధానం ప్రేక్షకులను మెప్పిస్తుదన్నారు. కుటుంబ బాధ్యతలు మోసే పాతికేళ్ల ప్రతి ఆడపిల్ల దేవి పాత్రలో తమను తాము చూసుకుంటారన్నాడు దర్శకుడు.


ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘అనగనగా పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక.. నాలుగో జీవనాధారం కోసం ఒక చోట కలుసుకున్నాయి. ఆ జీవనాధరమే కథలు. సింహం విసిరిన పంజా కథలు, చిరుత పెట్టిన పరుగు కథలు, ఈగ చెప్పిన బాహుబలి కథలు వినేందుకు వచ్చినవాటికి మైక్ వద్ద ఒక ముసలి తాబేలు కనిపించింది. కదలడానికి కష్టపడే నువ్వేం కథలు చెబుతావని అడగ్గా.. జవాబుతో ఆకాశమంత అనుభవంతో కథలు మొదలయ్యాయి. అన్నీ మన కథలే.. నిన్ను కన్నవాళ్లతో నీకు.. నీ లైఫ్ పార్టనర్‌తో నీకు.. నువ్వు కన్నవాళ్లతో నీకు.. ఈ ప్రపంచంతో నీకు.. నీతో నీకుండే కథలు..’’ అంటూ ‘పంచతంత్రం’ ట్రైలర్‌ను ముగించారు. చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘పంచతంత్రం’ టీజర్‌ను ఇక్కడ చూసేయండి. 


‘పంచతంత్రం’ టీజర్: 



‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు – చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన.. ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నామన్నారు మేకర్స్. ఐదు భావేద్వేగాల మిళితమైన చక్కటి కథ ఇది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి” అని  చెప్పారు.  చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చిన ఈ సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.