రష్మీ రాకెట్: 


టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ.. బాలీవుడ్ కి వెళ్లిన తరువాత కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎన్నుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. ఇటీవల ఆమె నటించిన 'హసీనా దిల్ రుబా', 'అనబెల్ సేతుపతి వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. తాజాగా తాప్సీ నటించిన మరో సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఆకర్ష్ ఖురానా డైరెక్ట్ చేసిన 'రష్మీ రాకెట్' అనే సినిమాలో నటించింది తాప్సీ. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 15న జీ5 ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో తాప్సీ మూడు రకాల లుక్స్‌ లో కనిపించనున్నారు. ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతిగా.. ఆ తర్వాత అథ్లెట్‌గా నేషనల్‌కు సెలెక్ట్‌ అయిన క్రీడాకారిణిగా.. అంతర్జాతీయ వేదికలపై జరిగే పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే ప్లేయర్ గా.. ఇలా మూడు లుక్స్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు తాప్సీ. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.






 


Also Read: అతిగా ఏడ్చే మగాళ్లను నమ్మకండి.. ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ పై నరేష్ ఘాటు వ్యాఖ్యలు..



సర్దార్‌ ఉద్దమ్:


బాలీవుడ్ లో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విక్కీ కౌశల్. ఆయన కీలకపాత్రలో నటించిన సినిమా 'సర్దార్ ఉద్ధమ్'. సూజిత్‌ సిర్కార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో విక్కీ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అక్టోబరు 16న ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం ఆధారంగా ఈ కథను సిద్ధం చేసుకున్నారు. ఈ ఉదంతంలో మొత్తం వెయ్యికి పైగా భారతీయులు మరణించారు. మనదేశంలో అదొక బ్లాక్ డే. ఈ ఉదంతానికి కారణమైన బ్రిటిషర్ జనరల్‌ డయ్యర్‌ను విప్లవకారుడైన ఉద్దమ్‌ సింగ్‌ కాల్చి చంపుతాడు. దానికి గాను అతడికి ఉరిశిక్ష పడుతుంది. ఇదే కాన్సెప్ట్ తో సినిమా మొత్తం సాగనుంది. 






 



Also Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్ల



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి