ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ సహా ఆయన భార్య, పెద్ద కుమారుడు కరోనా బారిన పడ్డారు. ఆయన చిన్న కుమారుడు అజయ్ కృష్ణ మాస్టర్‌కు మాత్ర‌మే కరోనా సోకలేదని తెలిసింది. గత నాలుగు రోజులుగా హైద‌రాబాద్‌లోని ఏఐజీ (ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలాజీ)లో శివ  శంకర్ మాస్టర్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్టు సమాచారం. పెద్ద కుమారుడు, భార్య హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అజయ్ కృష్ణ వీళ్లకు కావాల్సిన బాగోగులు చూసుకుంటున్నారు. శివ శంకర్ మాస్టర్ చికిత్సకు రోజుకు లక్ష రూపాయల వరకూ ఖర్చు అవుతోందని, కుమారుడి దగ్గర అంత డబ్బు లేకపోవడంతో పరిశ్రమ నుంచి లేదా ప్రజలు ఎవరైనా ఆర్ధిక సహాయం చేస్తారేమోనని....  దాతల కోసం ఎదురు చూస్తున్నారు.
శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. 'మగధీర' సినిమాలో 'ధీర ధీర...' పాటకు గాను ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. ఆయన నటుడిగానూ కొన్ని సినిమాలు చేశారు. టీవీ షోలకు జ‌డ్జ్‌గా వ్యవహరించారు. ఎన్నో గొప్ప పాటలకు కొరియోగ్రఫీ చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాన్స్ మాస్టర్ కు ఇటువంటి పరిస్థితి రావడం బాధాకరమని ఆయన అభిమానులు అంటున్నారు. శివ శంకర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఇటీవల సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పరిశ్రమతో పాటు ప్రేక్షకులు ఆందోళన చెందారు. ఆయన కోలుకుంటున్నారని ఊపిరి తీసుకునే లోపు... శివ శంకర్ మాస్టర్ వార్త తెలిసింది. మాస్టర్ కూడా త్వరగా కోలుకోవాలని పరిశ్రమ వ్యక్తులు కోరుకుంటున్నారు. 

Also Read: డిసెంబర్ బరిలో మరో యంగ్ హీరో.. డేట్ లాక్ చేసేసుకున్నాడు..


Also Read: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. మెగాపవర్ మాస్.. రెడీగా ఉండండి..


Also Read: 'రిపబ్లిక్' సినిమాను థియేటర్లో చూడని సాయితేజ్.. తొలిసారి ఓటీటీలోనే..


Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్‌ అనే విషయం మర్చిపోయిందా..?'


Also Read:  స్కైలాబ్ పోస్టర్‌తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్


Also Read: సాయి పల్లవి చెల్లెలి సినిమా విడుదలకు సిద్ధం... త్వరలో తెలుగులో కూడా నటించే అవకాశం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి